’థర్డ్‌ పార్టీ’ జప్తులు నిలిపివేశాం

24 Sep, 2022 10:10 IST|Sakshi

మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వెల్లడి 

న్యూఢిల్లీ: వాహన రుణాల రికవరీలకు సంబంధించి థర్డ్‌–పార్టీ ఏజంట్ల ద్వారా జప్తులు చేయడాన్ని నిలిపివేసినట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఎంఎంఎఫ్‌ఎస్‌ఎల్‌) వెల్లడించింది. ఇటీవలి విషాద ఘటన నేపథ్యంలో థర్డ్‌ పార్టీ ఏజంట్లను ఎలా వినియోగించుకోవచ్చనే అంశాన్ని అధ్యయనం చేయనున్నట్లు సంస్థ వైస్‌ చైర్మన్‌ రమేష్‌ అయ్యర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ట్రాక్టర్‌ రుణ రికవరీ కోసం వచ్చిన ఎంఎంఎఫ్‌ఎస్‌ఎల్‌ థర్డ్‌ పార్టీ ఏజంటు ..  ఆ వాహనాన్ని మీద నుంచి పోనివ్వడంతో గత వారం 27 ఏళ్ల గర్భిణీ మృతి చెందిన ఘటన గత వారం జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో చోటు చేసుకుంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రుణాల రికవరీల కోసం ఎంఎంఎఫ్‌ఎస్‌ఎల్‌.. థర్డ్‌ పార్టీ ఏజంట్లను ఉపయోగించకుండా నిషేధం విధించింది. రికవరీ, జప్తుల కోసం సొంత ఉద్యోగులను మాత్రమే ఉపయోగించుకోవాలని ఆదేశించింది.

చదవండి:  TCS Work From Home Ends: టీసీఎస్‌ భారీ షాక్‌.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా!

మరిన్ని వార్తలు