అగ్నివీరులకు స్వాగతమంటున్న ఆనంద్‌ మహీంద్రా

20 Jun, 2022 11:56 IST|Sakshi

అగ్నిపథ్‌ ఇప్పుడు దేశాన్ని పట్టి కుదిపేస్తోన్న అంశం. గత నాలుగైదు రోజులుగా అన్ని అంశాలు అగ్నిపథ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ పథకానికి సానుకూలంగా కొందరు కామెంట్లు చేస్తే విమర్శిస్తూ మరికొందరు మాట్లాడుతున్నారు. కాగా కాంటెంపరరీ ఇష్యూస్‌పై ఎప్పుడూ స్పందించే ఆనంద్‌ మహీంద్రా ఈ విషయంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు ఓ అడుగు ముందుకేసి బంపరాఫర్‌ ఇచ్చారు. 

అగ్నిపథ్‌ చుట్టూ చెలరేగిన వివాదం పట్ల ఆనంద్‌ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. ఈ పథకం వస్తుందని ఏడాది కిందట విన్నప్పుడు చెప్పిన అభిప్రాయాలే ఇప్పుడు తనకు ఉన్నాయని ఆయన తెలిపారు. శిక్షణ, క్రమశిక్షణ కలిగిన అగ్ని వీరులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. విజయవంతంగా శిక్షణ, సర్వీసు పూర్తి చేసుకున్న అగ్నివీరులకు మహీంద్రా గ్రూపులో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటూ ముందుకొచ్చారాయన.

చదవండి: ఆర్నాల్డ్‌ సుభాష్‌నగర్‌.. ఎక్కడున్నాడీ వ్యక్తి !

మరిన్ని వార్తలు