పెట్రోల్‌ డీజిల్‌ కష్టాలకు చెక్‌! మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్‌ ఆటో

27 Jan, 2022 14:54 IST|Sakshi

Mahindra launches electric three-wheeler: పెరుగుతున్న ఫ్యూయల్‌ రేట్లు సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతుంటూ ఆటోలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారి ఆదాయానికి గండి పెడుతున్నాయి. ఫ్యూయల్‌ ఇంజన్లకు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న ప్రముఖ కంపెనీల నుంచి వాహనాలు రావడం లేదనే లోటు ఉండేది. తాజాగా మహీంద్రా గ్రూపు ఈ లోటును భర్తీ చేసింది.

ఈ ఆల్ఫా కార్గో పేరుతో త్రీ వీలర్‌ ఈవీ సెగ్మెంట్‌లోకి మహీంద్రా గ్రూపు అడుగు పెట్టింది. 2022 జనవరి 18న ఈ ఆల్ఫా కార్గో ను ఇండియా మార్కెట్‌లో రిలీజ్‌ చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ధర 1.44 లక్షలుగా ఉంది. ఒక్కసారి ఈ వాహనాన్ని ఛార్జ్‌ చేస్తే 310 కిలోల లోడుతో 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. గరిష్ట వేగం గంటకి 25 కిలోమీటర్లు. మొబైల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టుకున్నంత తేలిగా ఈ ఆల్ఫాను ఛార్జ్‌ చేయోచ్చని మహీంద్రా చెబుతోంది.

ఫ్యూయల్‌ రేట​‍్లు పెంచిన తర్వాత పట​‍్టణ ప్రాంతాల్లో కార్గో సేవలు అందించే ఆటోడ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. కార్గో సేవల్లో వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం ఫ్యూయల్‌కే పోతుంది. ఇ ఆల్ఫాతో ఈ సమస్య తీరిపోతుందని మహీంద్రా చెబుతుంది. ప్యాసింజర్‌ విభాగంలో ఈ ఆల్ఫా మినీ కూడా మహీంద్ర పోర్ట్‌ఫోలియోలో ఉంది. 
 

మరిన్ని వార్తలు