మహీంద్రా థార్‌ కొత్త శ్రేణి

13 Jan, 2023 02:00 IST|Sakshi

వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌ థార్‌ మోడల్‌లో రేర్‌ వీల్‌ డ్రైవ్‌ ట్రిమ్స్‌ను ప్రవేశపెట్టింది. మాన్యువల్, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్స్‌లో వీటిని రూపొందించింది. ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభం. వీటిలో డీజిల్‌లో రెండు మాన్యువల్, పెట్రోల్‌తో ఆటోమేటిక్‌ వేరియంట్‌ ఉంది.

కస్టమర్ల నుంచి వచ్చిన సూచనల మేరకు నూతన శ్రేణిని పరిచయం చేసినట్టు కంపెనీ ఆటోమోటివ్‌ విభాగం ప్రెసిడెంట్‌ విజయ్‌ నక్రా తెలిపారు. ఔత్సాహిక కస్టమర్లకు థార్‌ మరింత చేరువ అవుతుందని చెప్పారు. ఇక 4 వీల్‌ డ్రైవ్‌ శ్రేణి ఇప్పుడు ఆధునిక ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ లాకింగ్‌ సిస్టమ్‌తో తయారైందని కంపెనీ తెలిపింది.

మరిన్ని వార్తలు