Mahindra: క్రేజీ ఆఫర్‌..! పలు మహీంద్రా కార్లపై రూ. 3 లక్షల వరకు భారీ తగ్గింపు..!

8 Mar, 2022 15:50 IST|Sakshi

కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రముఖ దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా తాజాగా అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. హోళీ సందర్భంగా పలు కార్లపై మహీంద్రా భారీ తగ్గింపును అందిస్తోంది. మహీంద్రా ఆయా మోడల్స్‌పై ఏకంగా రూ.3.02 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది.

ఆయా మోడల్స్‌పై మహీంద్రా అందిస్తోన్న ఆఫర్స్‌ ఇవే..!

మహీంద్రా KUV100 NXT
మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ KUV100 NXTపై రూ. 38,055 వరకు నగదు తగ్గింపును, రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపు, ఎక్సేఛేంజ్‌ ఆఫర్ కింద రూ. 20,000 వరకు కొనుగోలుదారులకు లభించనుంది.  

మహీంద్రా XUV300
మహీంద్రా XUV300 కొనుగోలుపై రూ. 30,000 వరకు నగదు తగ్గింపు, రూ. 10,000 వరకు విలువైన ఉచిత యాక్సెసరీలను అందిస్తోంది. ఎక్సేఛేంజ్‌ ఆఫర్ కింద రూ. 25,000 వరకు ప్రయోజనాలను మహీంద్రా కల్పించనుంది. దాంతో పాటుగా రూ. 4000 కార్పొరేట్ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది.

మహీంద్రా స్కార్పియో
మహీంద్రా స్కార్పియో కారు కొనుగోలుపై ఎటువంటి నగదు తగ్గింపును అందించడం లేదు. అయితే కొనుగోలుదారులు రూ. 15,000 పైగా విలువైన యాక్సెసరీలను ఉచితంగా  పొందవచ్చు. ఈ  కారు కొనుగోలుపై కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 4,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 15,000 కూడా అందుబాటులో ఉన్నాయి. 

మహీంద్రా అల్టురాస్
మహీంద్రా Alturas G4 కారు కొనుగోలుపై  ఏకంగా రూ. 2.2 లక్షల భారీ తగ్గింపును అందిస్తోంది .దాంతో పాటుగా రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 11,500 అదనపు కార్పొరేట్ తగ్గింపును మహీంద్రా కల్పిస్తోంది.అంతేకాకుండా ఈ కారు కొనుగోలుపై రూ. 20,000 విలువైన యాక్సెసరీలను ఉచితంగా పొందవచ్చును.

మహీంద్రా మరాజ్జో
మహీంద్రా మరాజో ఎస్‌యూవీ బేస్ M2 ట్రిమ్‌పై రూ. 20,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌, ఇతర ట్రిమ్‌ వేరియంట్స్‌పై రూ. 15,000 క్యాష్‌ డిస్కౌంట్‌ లభించనుంది. వీటితో పాటుగా రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌, కార్పొరేట్ డిస్కౌంట్‌ రూ. 5,200 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. 

చదవండి: సరికొత్త హంగులతో విడుదలైన ఎంజీ జెడ్‌ఎస్‌ ఎలక్ట్రిక్ కారు..!

మరిన్ని వార్తలు