మహీంద్రా కార్లపై బంపర్ ఆఫర్స్.. రూ.2.58 లక్షల వరకు డిస్కౌంట్లు

12 Sep, 2021 15:53 IST|Sakshi

మహీంద్రా అండ్ మహీంద్రా తన బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యువి కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీ ఇటీవల ఎక్స్ యువి700ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇతర మహీంద్రా ఎక్స్‌యువి 500, సబ్ కాంపాక్ట్ ఎక్స్‌యువి 300, పాపులర్ స్కార్పియో కార్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ డిస్కౌంట్లకు సంబంధించిన వివరాలు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే వర్తిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి. (చదవండి: వారంలో రెండు రోజులు ఆఫీస్..!)

మహీంద్రా ఎక్స్‌యువి 500 డిస్కౌంట్లు

 • మహీంద్రా ఎక్స్‌యువి 500 డబ్ల్యు11, డబ్ల్యు11 ఆప్షన్ ఎటీ వేరియెంట్లపై కంపెనీ రూ.1,79,800 వరకు క్యాష్ డిస్కౌంట్ తో పాటుగా ₹6,500 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. అలాగే, ఎక్స్ఛేంజ్ కింద ₹50,000 వరకు అదనపు బోనస్ కూడా అందిస్తుంది. ఇంకా కంపెనీ ₹20,000 విలువైన యాక్సెసరీస్ కూడా ఇవ్వనుంది.
   
 • ఇక డబ్ల్యు7, డబ్ల్యు9, డబ్ల్యు7 ఎటీ, డబ్ల్యు9 ఎటీ వేరియెంట్లపై మహీంద్రా ₹1,28,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే, ₹6,500 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, ₹50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, ₹20,000 విలువైన యాక్సెసరీస్ ఇస్తుంది.
   
 • డబ్ల్యు5, డబ్ల్యు7, డబ్ల్యు9, డబ్ల్యు11 ఆప్షన్, డబ్ల్యు7 ఎటీ, డబ్ల్యు9 ఎటీ, డబ్ల్యు11 ఆప్షన్ ఎటీ మోడల్స్ అన్నింటిపై, కంపెనీ ₹2,58,000 వరకు ప్రయోజనాలను కూడా ఇవ్వనుంది.

మహీంద్రా ఎక్స్‌యువి 300 డిస్కౌంట్లు

 • డబ్ల్యు8 ఆప్షన్ డ్యూయల్ టోన్ బీఎస్ఐవీ, డబ్ల్యు8 ఆప్షన్ డ్యూయల్ టోన్, డబ్ల్యు8, డబ్ల్యు8 ఆప్షన్ డ్యూయల్ టోన్, డబ్ల్యు8 ఆప్షన్ డీజిల్, డబ్ల్యు8 ఎఎమ్ టి ఐచ్ఛిక డీజిల్, డబ్ల్యు8 ఆప్షన్ డ్యూయల్ టోన్, డబ్ల్యు8 ఆప్షన్ ఎఎమ్ టి, డబ్ల్యు8 డీజిల్ సన్ రూఫ్, డబ్ల్యు8 ఎఎమ్ టి ఆప్షన్ డీజిల్ డ్యూయల్ టోన్, డబ్ల్యు8 ఎఎమ్ టి ఆప్షన్ డీజిల్ డ్యూయల్ టోన్ వంటి కార్లపై కంపెనీ ₹4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, ₹20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, ₹15,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. ఇక కొనుగోలుదారులు యాక్ససరీలపై ₹5000 ఆఫర్ పొందవచ్చు. 
   
 • ఇక డబ్ల్యు4, డబ్ల్యు4 డీజిల్ కార్లపై కంపెనీ ₹4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, ₹20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తోంది. అలాగే యాక్ససరీలపై కంపెనీ ₹5,000 వరకు తగ్గింపును అందిస్తోంది.

మహీంద్రా స్కార్పియోపై డిస్కౌంట్లు

 • ఎస్3 ప్లస్ కొరకు, ఎస్3 ప్లస్ 9 సీటర్ కార్లపై మహీంద్రా ₹4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తోంది. కంపెనీ ₹5,000 వరకు ఉచిత యాక్ససరీలను కూడా అందిస్తోంది.
   
 • ఎస్11, ఎస్9, ఎస్7 కార్లపై కంపెనీ కేవలం ₹4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తుంది.
   
 • ఎస్5 వేరియంట్ కారుపై కంపెనీ ₹4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, ₹15,000 వరకు విలువైన ఉచిత యాక్ససరీస్ ఆఫర్ అందిస్తోంది.
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు