Mahindra: మహీంద్రా సంచలన నిర్ణయం..! ఆ కంపెనీని పూర్తిగా అమ్మేసింది..!

11 Jan, 2022 19:21 IST|Sakshi

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా గ్రూప్స్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. దక్షిణకొరియాకు చెందిన శాంగ్‌యాంగ్ మోటార్స్‌ను పూర్గిగా అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలో మహీంద్రా 75 శాతం మేర వాటాలను కల్గి ఉంది. 

దక్షిణకొరియాకు చెందిన శాంగ్‌యాంగ్‌ మోటార్స్‌ను 2010లో మహీంద్రా అండ్‌ మహీంద్రా వాటాలను కొనుగోలు చేసింది. తాజాగా భారీ నష్టాలు రావడంతో కంపెనీని వదులకునేందుకు మహీంద్రా సిద్దమైంది. అంతేకాకుండా భారీ అప్పులు శాంగ్‌యాంగ్‌ను వెంటాడాయి.దీంతో మహీంద్రా కంపెనీ వీటిలో ఇన్వెస్ట్‌ చేయడం నిలిపివేసింది. శాంగ్‌యాంగ్‌ను కొనుగోలుచేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.  మహీంద్రా కొత్త కొనుగోలుదారుని కనుగొనడంలో విఫలమైనందున శాంగ్‌యాంగ్ మోటార్ చాలా నెలలుగా దక్షిణ కొరియా కోర్టు రిసీవర్‌షిప్‌లో ఉంది.

ఎడిసన్‌ చేతిలోకి..!
దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఎడిసన్ మోటార్స్ .కో నేతృత్వంలోని కన్సార్టియం అప్పుల ఊబిలో కూరుకుపోయిన శాంగ్‌యాంగ్ మోటార్ కో లిమిటెడ్‌ను కొనుగోలు చేసేందుకు అంగీకరించిందని శాంగ్‌యాంగ్ మోటార్ సోమవారం తెలిపింది. సుమారు 254.56 మిలియన్‌ డాలర్లకు స్థానిక దక్షిణకొరియా  కన్సార్టియం కొనుగోలు చేసినట్లు కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 


 

భారీ దెబ్బ..!
ఇటీవలి కాలంలో శాంగ్‌యాంగ్‌కు మోటార్స్‌కు భారీ నష్టాలు వెంటాడాయి. కోవిడ్‌-19 రాకతో అది మరింత తీవ్రంగా మారింది. వాహన విక్రయాలు 2021లో 84,000కు తగ్గాయి.ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 21 శాతం తగ్గింది. దీంతో కంపెనీను అమ్మకానికి ఉంచింది.

చదవండి:  అదానీ గ్రూప్స్‌ మరో రికార్డు..! ఏకంగా రూ. 10 లక్షల కోట్లు..!

మరిన్ని వార్తలు