మహీంద్రాకు ఏమైంది? రెండోసారి ఆ కార్ల రీకాల్‌

23 Jul, 2022 14:49 IST|Sakshi

సాక్షి,ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్‌యూవీ700 కార్లను మరోసారి రీకాల్‌ చేసింది. ఏడబ్యుడీ వేరియంట్లలో ఈసారి రీకాల్ ప్రధాన భాగం భర్తీ కోసంవాహనాలను వెనక్కి తీసుకుంటోంది.  నెలరోజుల్లోలనే వాహనాలను రీకాల్‌ చేయడం ఇది రెండోసారి. ప్రొపెల్లర్ షాఫ్ట్ సమస్య కారణంగా మహీంద్ర ఎక్స్‌ యూవీ 700 కార్లను ఇటీవల రీకాల్‌ చేసిన సంగతి తెలిసిందే. 

రియర్ వీల్ కాయిల్ స్ప్రింగ్‌ల ప్రస్తుత ప్లేస్‌మెంట్‌లో ఉన్న సమస్యల కారణంగా  మహీంద్ర  ఈ  రీకాల్‌ చేసినట్లు తెలుస్తోంది. XUV700 AWDలోని వెనుక చక్రాల కాయిల్ స్ప్రింగ్‌లు ప్రతి స్ప్రింగ్‌లో 9 రౌండ్ కాయిల్స్  ఉండేలా మార్పులు చేసింది.  అయితే 9 కి బదులుగా 8 రౌండ్ కాయిల్స్ ఉంటే, ఆ కార్లను కొత్త స్ప్రింగ్‌లతో భర్తీ చేసేందుకు సమీపంలోని సర్వీస్ సెంటర్‌లో  సంప్రదించాలని మహీంద్ర కోరినట్టు తెలుస్తోంది. అయితే ప్రభావిత వాహనాల ఖచ్చితమైన సంఖ్య తెలియదు.

కాగా మహీంద్రా ఎక్స్‌యూవీ700  2021లో లాంచ్ అయిన పాపులన్‌ మోడల్‌.  కొన్ని వేరియంట్‌ల నిరీక్షణ సమయం ఒక సంవత్సరం అంటే దీన్ని క్రేజ్‌ అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా సుమారు 70వేల ఎక్స్‌యూవీ700  కార్ల డెలివరీలు పెండింగ్‌లో ఉన్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజుకర్ ఇటీవల  వెల్లడించారు.  5 సీట్లు ,  7 సీట్ల ఎంపికలతో  లభిస్తున్న ఈ కారు ధర 13.18 లక్షలు,(ఎక్స్-షోరూమ్)  ప్రారంభం.

ఇది కూడా చదవండి:  ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 12పై భారీ తగ్గింపు
2022 ఆల్టో: ఎక్సైటింగ్ సర్ప్రైజ్ అంటున్న మారుతి
 

మరిన్ని వార్తలు