ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ: కొత్త అధ్యాయానికి మహీంద్ర, టీజర్‌ అదిరింది

5 Aug, 2022 15:01 IST|Sakshi

సాక్షి,ముంబై: ఆటో మేజర్‌ మహీంద్ర అండ్‌ మహీంద్ర ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లో వేగంగా దూసుకొవస్తోంది. ఈ క్రమంలో దేశీయ  ఆటోమోటివ్ పరిశ్రమలో  కొత్త చరితను లిఖించేందుకు సిద్దపడుతోంది. దీనికి  వరుస టీజర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా  మరో టీజర్‌ను మహీంద్ర సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

బోర్న్ ఎలక్ట్రిక్ విజన్ కింద ఐదు విభిన్న ఆల్ ఎలక్ట్రిక్ -ఎస్‌యూవీ  కాన్సెప్ట్‌లను ఆవిష్కరింనుంది  మహీంద్ర. వీటిని  ఆగస్ట్ 15, ప్రపంచ ప్రీమియర్‌ వేడుకలో ఘనంగా  పరిచయం చేయనుంది. ఈ ఎస్‌యూవీలకు సంబంధించిన ఇప్పటికే తన కార్ల డిజైన్లను హైలైట్‌ చేస్తూ కొన్ని టీజర్లు వదిలిన సంగతి తెలిసిందే. మహీంద్రా తాజా టీజర్‌లో ఇన్-కార్ కనెక్టివిటీ ఫీచర్లను సూచనప్రాయంగా వెల్లడించింది.  

డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మ్యూజిక్, యాంబియంట్ లైటింగ్ వాటిపై కూడా హింట్‌ ఇచ్చింది. ఐదు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో డిజిటల్ స్క్రీన్‌, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కామన్‌గా అందింస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. అయితే వీటి ఫీచర్లను పెద్దగా వెల్లడించకపోయినప్పటికీ మునుపటి టీజర్ల ప్రకారం కొత్త మోడళ్లలో కూపే, కాంపాక్ట్ SUVలు, మిడ్‌-సైజ్‌, ఫాస్ట్‌బ్యాక్‌గా ఉండనున్నాయి. అలాగే రానున్న అయిదేళ్లలో ఈ ఐదింటినీ రిలీజ్‌ చేయనుందని  ఒక అంచనా. 

ఈ ప్యూర్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు మాత్రమే కాదు, మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్‌ని కూడా విడుదల చేయనుంది.  టాటా నెక్సాన్ EV మ్యాక్స్, MG ZS EV వంటి  నేటి తరం ఎలక్ట్రిక్ వాహనాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రడీ అవుతోంది.  ఇప్పటీకే రోడ్లపై పరీక్షిస్తున్న ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2022 చివరలో లాంచ్‌ చేయనుంది. 

మరిన్ని వార్తలు