ఎస్‌యువి కార్ల కోసం మహీంద్రా సరికొత్త లోగో

9 Aug, 2021 20:31 IST|Sakshi

మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ సోమవారం(ఆగస్టు 9) ఇండియా ప్రొడక్ట్ పోర్ట్ ఫోలియోలో తన అన్ని ఎస్‌యువి కార్ల కోసం కొత్త లోగోను ఆవిష్కరించింది. రాబోయే మహీంద్రా ఎక్స్‌యువి 700 కారు ఈ లోగోతో రానున్న మొట్ట మొదటి ఎస్‌యువి అవుతుంది. దేశంలో తన ఎస్‌యువిల కోసం తీసుకొస్తున్న లోగోను చూస్తే  'ఎక్స్ ప్లోర్ ది ఇంపాజిబుల్' అనే బ్రాండ్ స్టేట్ మెంట్ ను అండర్ లైన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ లోగో కొత్త సవాళ్లను స్వీకరించే ఆశయం & సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని కంపెనీ పేర్కొంది. 

"ఇది కొత్త లోగో మాత్రమే కాదు, మహీంద్రాలో పునరుజ్జీవం పొందిన స్ఫూర్తికి ప్రాతినిధ్యం" అని ఎంఅండ్ఎమ్ లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ సీఈఓ వీజయ్ నక్రా అన్నారు. లాంఛ్ చేయడానికి సిద్దంగా ఉన్న ఎక్స్‌యువి 700పై ఇప్పుడు అందరి దృష్టి ఉంటుంది. త్వరలో రాబోయే ఎక్స్‌యువి 700 మీద సరికొత్త లోగో డిజైన్ ఉంటుంది. "లోగో మార్పు వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే మీరు కోరుకున్న చోటుకు వెళ్ళవచ్చు, మీరు కోరుకున్నప్పుడు పూర్తి భద్రతతో సరికొత్త ప్రపంచానికి వెళ్లడం" అని ఎంఅండ్ఎం లిమిటెడ్ లో ఇవిపీ, చీఫ్ డిజైన్ ఆఫీసర్ ప్రతాప్ బోస్ అన్నారు.

మరిన్ని వార్తలు