ఈ కార్లపై రూ. 3.06 లక్షల భారీ తగ్గింపు

22 Apr, 2021 14:37 IST|Sakshi

ఎం అండ్‌ ఎం బంపర్‌ ఆఫర్‌

థార్‌  మినహా అన్ని మోడళ్ల కార్లపై డిస్కౌంట్‌

ఏప్రిల్‌ 30 వరకు అందుబాటులో

సాక్షి, ముంబై:  కొత్తగా  కారు సొంతం చేసుకోవాలనుకునే వారికి, అలాగే కొత్తకారు అప్‌డేట్‌ అవ్వాలనుకునే వారికి ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అండ్‌  మహీంద్రా  మరోసారి  తీపి కబురు చెప్పింది. ఇటీవల లాంచ్‌ చేసిను థార్‌ మినహా అన్ని కార్లపై భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది. బీఎస్-6 కార్లను భారీ డిస్కౌంట్‌ ధరలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఈ అఫర్‌లో దాదాపు 3.06 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌ రేట్లు ఏప్రిల్ 30, 2021 వరకు అందుబాటులో ఉంటాయి. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం  ఆయా డీలర్ల పరిధిల ఈ తగ్గింపులో స్వల్ప మార్పులు ఉండవచ్చు.  ఆసక్తిగల కొనుగోలుదారులు కెయువి 100 ఎన్‌ఎక్స్‌టి నుండి అల్టురాస్ జీ 4 ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ వరకు  పలు మోడళ్ల కార్లపై నగదు ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ ,  కార్పొరేట్ డిస్కౌంట్ లాంటి ప్రయోజనాలను పొందవచ్చు.

ముఖ్యంగా అల్టురాస్ జీ 4 ఎస్‌యూవీ కొనుగోలుపై మొత్తం 3.06 లక్షల వరకు తగ్గింపు లభించనుంది.  ఇందులో 2 2.2 లక్షల వరకు నగదు ఆఫర్ రూ 50,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉన్నాయి. కార్పొరేట్ ఆఫర్ , ఇతర ప్రయోజనాలు వరుసగా 16,000, 20,000 వరకు లభ్యం.

మరాజ్జో ఎంపీవీలో అందించే గరిష్ట తగ్గింపు  41,000 రూపాయలు.  ఇందులో రూ. 20,000 వరకు నగదు ప్రయోజనాలు, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 15,000 వరకు,  కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 6,000 వరకు లభిస్తాయి.

చదవండి: ఉన్నట్టుండి పేలిన ఫోన్‌, షాకైన జనం: వైరల్‌ వీడియో

ఎన్నిసార్లు గెలుస్తావ్‌ భయ్యా..! నెటిజన్లు ఫిదా

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు