మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్

7 Feb, 2021 14:41 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆటోమొబైల్ తయారీ దిగ్గజం మహీంద్రా కంపెనీ ఫిబ్రవరి నెలలో తన బిఎస్6 ఎస్‌యూవీలపైన డిస్కౌంట్ ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. బోలెరో కారుపై రూ.24వేల నుంచి మొదలు పెడితే అల్టురాస్ జీ4పై రూ.3.06లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా క్యాష్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటి ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ డిస్కౌంట్స్ ఫిబ్రవరి 28, 2021 వరకు ఉంటాయి. ఈ ఆఫర్లు మీ ప్రాంతాలలో డీలర్షిప్ బట్టి వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.(చదవండి: ఇండియాలో బెస్ట్‌ సెల్లింగ్‌ కారు ఇదే!)

మహీంద్రా తన ప్రీమియం అల్టురాస్ ఎస్‌యూవీ జీ4పై ఏకంగా రూ.3.06లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. దీనిపై రూ.2.2 లక్షల వరకు క్యాష్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.50వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.16 వేల నుంచి రూ.20వేల వరకు అందిస్తున్నారు. తర్వాత మహీంద్రా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీపై గరిష్టంగా రూ.44వేల వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఎస్‌యూవీపై క్యాష్ ఆఫర్ కింద రూ.10,000 డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.25,000 డిస్కౌంట్, రూ.5వేల కార్పొరేట్ డిస్కౌంట్ తో పాటు ఇతర ప్రయోజనాలు అందనున్నాయి.

మహీంద్రా కెయువి100 ఎన్ఎక్స్ టిపై క్యాష్ ఆఫర్ కింద రూ.38వేలు, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.20వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.4వేలు డిస్కౌంట్ పొందవచ్చు. కెయువి100 ఎన్ఎక్స్ టిని కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు రూ.62,055 వరకు ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే మహీంద్రా స్కార్పియో మీద రూ.39,502 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో రూ.10వేలు క్యాష్ డిస్కౌంట్, రూ.15వేలు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, రూ.4,500 కార్పొరేట్ ఆఫర్, రూ.10,000 వరకు ఇతర ప్రయోజనాలు ఉన్నాయి.(చదవండి: ఎస్‌బీఐ వినియోగదారులకు శుభవార్త!)

ప్రసిద్ధ మహీంద్రా ఎక్స్‌యువి500 మీద గరిష్టంగా రూ.80,800వరకు డిస్కౌంట్ లభించనుంది. ఇందులో రూ.36,800 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.9,000 కార్పొరేట్ డిస్కౌంట్ తో పాటు 
రూ.15,000వరకు అదనపు ఆఫర్లు ఉన్నాయి. ఇక మహీంద్రా మరాజోపై గరిష్టంగా రూ.36వేలు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇందులో క్యాష్ ఆఫర్ కింద రూ.15వేలు, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.15వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.6,000 వరకు అందిస్తున్నారు. చివరగా, మహీంద్రా బొలెరోపై రూ.24,050 డిస్కౌంట్ అందిస్తున్నారు. దీనిపై రూ.3,500వరకు క్యాష్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.10వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.4,000 వరకు ఆఫర్ లభిస్తుంది.

మరిన్ని వార్తలు