మహీంద్రా స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ లీక్‌? షాకింగ్‌ వీడియో వైరల్‌ 

28 Feb, 2023 13:35 IST|Sakshi

సాక్షి, ముంబై: మహీంద్రా పాపులర్‌  ఎస్‌యూవీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్‌లో హల్‌చల్‌ చూస్తోంది.  గత ఏడాది లాంచ్‌  చేసిన స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ కారులో వాటర్‌ లీక్‌ అవుతున్న వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో 1 రోజు క్రితం పోస్ట్ అయిన ఈ వీడియో  ఇన్‌స్టాగ్రామ్‌లో 4.7 మిలియన్ల  వ్యూస్‌ని సంపాదించింది.  

యూట్యూబర్‌ అరుణ్ పన్వార్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన మహీంద్రా స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ కారులో నీరు ఎలా లీక్ అయ్యిందో చూపించే వీడియోను  షేర్‌ చేశారు. కొండల్లో ప్రయాణిస్తుండగా ఓ జలపాతం తనకు ఈ అనుభవం ఎదురైందని  వీడియోలో చెప్పాడు. తన కారును జలపాతం కింద కడగాలని నిర్ణయించుకున్నాడు.  అక్కడ కారును పార్క్ చేసే ముందు డ్రైవర్ సన్‌రూఫ్‌ను మూసివేసినా కూడా సన్‌రూఫ్,  స్పీకర్ల ద్వారా కారులోకి నీరు లీక్ అయిందని, కారు లోపల పాడైపోయిందని  పేర్కొన్నాడు. వీడియోలో, రూఫ్-మౌంటెడ్ స్పీకర్‌లు, క్యాబిన్ ల్యాంప్ ద్వారా క్యాబిన్ లోపల నీరు పారుతూ ఉండగా, సన్‌రూఫ్ మూసి ఉందా లేదా అని రెండు సార్లు నిర్ధారించుకున్నట్టు కనిపిస్తోంది ఈవీడియోలో. (ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా: రామ్‌ చరణ్‌పై ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ వైరల్‌!)

అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. నా జీప్ మెరిడియన్‌ని చాలాసార్లు ఇలా కడిగాను కానీ ఇలా ఎపుడూ కాలేదని ఒకరు కమెంట్‌ చేయగా,  అలాంటిదేమీ లేదు.. ఉద్దేశపూర్వకంగా అతగాడు సన్‌రూఫ్‌ను కొద్దిగా తెరిచి ఉంచాడని భావిస్తున్నానంటూ మరొకరు కామెంట్‌ చేయడం గమనార్హం. (బిజినెస్‌ క్లాస్‌ ప్యాసింజర్‌కి షాక్‌, ట్వీట్‌ వైరల్‌: ఎయిరిండియా స్పందన)

అయితే కంటెంట్‌ కోసం అతను నిజంగానే అలా చేశాడా? అసలు ఏమైంది? సన్‌రూఫ్ ఎందుకు లీక్ అయ్యింది, సన్‌రూఫ్ లీక్ ప్రూఫ్‌గా ఉండే రబ్బరు సీల్ ఉందా లేదా అనేదానిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో దీనికి  సంబంధించిన  టెక్నికల్‌ అంశాలపై మహీంద్ర అధికారికంగా  స్పందించాల్సి ఉంది.  (గుండె ఆగిపోయినంత పనైంది! నాకే ఎందుకిలా? గూగుల్‌ ఉద్యోగి భావోద్వేగం )

A post shared by Arun Panwar (@arunpanwarx)

మరిన్ని వార్తలు