మహీంద్రా నుంచి రానున్న నయా ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలు ఇవే..

11 Feb, 2023 12:56 IST|Sakshi

దేశీ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా బార్న్‌ ఎలక్ట్రిక్‌ విభాగంలో మొదటి కార్లను పరిచయం చేసింది. వీటి చిత్రాలను గతేడాదే విడుదల చేసినప్పటికీ తాజాగా వీటిని జనం ముందుకు తీసుకువచ్చింది. సరికొత్త రేంజ్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలను ఇండియన్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టాలని చూస్తున్న మహీంద్రా బీఈ.05(BE.05), బీఈ.05 రాల్‌-ఈ(BE.05 RALL E), ఎక్స్‌యూవీ.ఈ9 (XUV.e9)లను ఆవిష్కరించింది.

ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీల తయారీలో ప్రముఖమైన మహీంద్రా అండ్‌ మహీంద్రా గతేడాది ఆగస్ట్‌లో రెండు ఈవీ మోడళ్లను పరిచయం చేసింది.  స్కార్పియో-ఎన్‌, అప్‌గ్రేడెడ్‌ థార్‌, ఎస్‌యూవీ700, అప్‌గ్రేడెడ్‌ బొలెరో వాహనాలు విజయవంతం కావడంతో మంచి ఊపు మీద ఉంది.  ఎక్స్‌యూవీ.ఈ9, బీఈ.05లను భవిష్యత్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీల్లో కీలకమైనవిగా కంపెనీ భావిస్తోంది. 

ఎక్స్‌యూవీ.ఈ9 సిరీస్‌లో రెండు వర్షన్లు ఉంటాయి. అలాగే మూడు ఎక్స్‌యూవీ బీఈ మోడళ్లలో బీఈ.05 ఒకటి. ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇన్‌గ్లో ఫ్లాట్‌ఫాం ఈ కార్లకు ఫౌండేషన్‌గా వ్యవహరిస్తుంది. వీటి ఉత్పత్తి 2024 డిసెంబర్‌లో ప్రారంభమై 2025లో మార్కెట్‌లోకి వస్తాయని మహీంద్రా సంస్థ తెలిపింది.

చదవండి: మారుతీ సుజుకీ టూర్‌–ఎస్‌.. అత్యధిక మైలేజీ ఇచ్చే సెడాన్‌ ఇదే..

మరిన్ని వార్తలు