వచ్చేస్తోంది, మహీంద్రా థార్​ 2డబ్ల్యూడీ విడుదల ఎప్పుడంటే?

8 Jan, 2023 13:21 IST|Sakshi

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా జనవరి 9న థార్‌ ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్‌ కారును మార్కెట్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే తొలిసారి మహీంద్రా సంస్థ థార్‌ వేరియంట్‌ కారును 2010లో వాహనదారులకు పరిచయం చేసింది. 13 ఏళ్ల నుంచి మార్కెట్‌లోకి ఆ సంస్థ నుంచి లేదంటే ఇతర సంస్థల నుంచి లగ్జరీ కార్లు విడుదలైన థార్‌ వేరియంట్‌ కార్లకు ప్రత్యేకంగా ఫ్యాన్‌ బేస్‌ ఉంది. 

అందుకే మహీంద్రా వరుసగా థార్‌ వేరియంట్‌ కార్లపై డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు అదే వెహికల్‌ను మార్పులు, చేర్పులు చేసి విడుదల చేస్తుంది. ఇప్పటికే విడుదలైన థార్‌ కార్స్‌ కొనుగోలు దారుల్ని విపరీంగా ఆకట్టుకోగా.. రేపు (జవనరి 9న) విడుదల కానున్న ఈ లేటెస్ట్‌ థార్‌ వేరియంట్‌ ఎలా ఉంటుందోనని అందరి ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో కారు ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 

ఈ కారు ప్రత్యేకత ఏంటంటే?
పలు ఆటోమొబైల్‌ బ్లాగ్స్‌ కథనాల మేరకు.. థార్‌ ఆర్‌డబ్ల్యూడీలో  4వీల్‌ డ్రైవ్‌ వెర్షన్‌కి సమానంగా 2 వీల్‌ డ్రైవ్‌ వెర్షన్‌ ఉండనుంది. ప్రత్యేకంగా 4*4  బ్యాడ్జ్‌ మీద కార్‌ రేర్‌ ఫెండర్స్‌ (వెహికల్‌ టైర్లపై ఉండే షేప్‌) తో బ్లేజింగ్‌ బ్రోంజే కలర్స్‌తో పరిచయం కానుంది. ఇప్పటికే ఈ తరహా వేరియంట్‌ కలర్స్‌ ఎక్స్‌యూవీ 300 టర్బోస్పోర్ట్‌లో కార్లలో సైతం లభ్యం అవుతున్నాయి. 4*2 వెర్షన్‌లో మాత్రం కార్‌ బాడీ కంప్లీట్‌గా ఎవరెస్ట్‌ వైట్‌ కలర్స్‌తో కొనుగోలు చేయొచ్చు.   

దీంతో పాటు కారు లోపల రేర్‌ వీల్‌ డ్రైవ్‌ (ఆర్‌డబ్ల్యూడీ) వెర్షన్ సెంటర్ కన్సోల్‌లో 4x4 సెలెక్టర్ లివర్‌(గేర్‌)కు బదులుగా క్యూబీ హోల్‌తో డిజైన్‌ చేశారు. తద్వారా ఆటో స్టార్ట్ స్టాప్ ఫంక్షన్‌తో పాటు డ్రైవర్‌ సీటు కుడి మోకాలి దగ్గర ఉన్న కంట్రోల్ ప్యానెల్ ద్వారా యాక్సెస్ చేసే సౌకర్యం ఉంది. 

మహీంద్రా థార్ ఆర్‌డబ్ల్యూడీ 
ఇంకా, థార్ ఆర్‌డబ్ల్యూడీ కొత్త పవర్‌ట్రెయిన్‌తో 1.5 లీటర్ల టర్బో డీజిల్‌ ఇంజిన్‌, సిక్స్‌ స్పీడ్‌ మ్యాన్యువల్‌ గేర్‌ బాక్స్‌తో 118.5‍హెచ్‌పీ నుంచి 300ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. మరోవైపు  4డబ్ల్యూడీ థార్ 132హెచ్‌పీ, 300ఎన్‌ఎం 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌తో కొనసాగుతుంది.

అలాగే, 2డబ్ల్యూడీ  వెర్షన్ 152హెచ్‌, 300ఎన్‌ఎం (ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 320ఎన్‌ఎం) ఉత్పత్తి చేసే 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఆరు-స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్‌ స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేస్తుంది.

మహీంద్రా థార్ ఏఎక్స్‌ 
రియర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో పాటు, థార్ 1.5 డీజిల్, 2.0 పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌ల కోసం తక్కువ-స్పెక్ ఏఎక్స్‌ ఆప్షనల్ ట్రిమ్‌ను అందిస్తుంది.  ఈ ట్రిమ్ ఇంతకుముందు థార్‌తో అందుబాటులో లేదని, కానీ ఇప్పుడు థార్‌ విడుదల చేస్తున్న వేరియంట్‌ కార్లలో డిజైన్‌ చేస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.  

ఏఎక్స్‌ (O) 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌కు బదులుగా 16-అంగుళాల స్టీల్ వీల్స్, ట్యూబ్యులర్ స్టీల్ సైడ్ స్టెప్, వినైల్ అప్హోల్స్టరీ, మాన్యువల్ మిర్రర్ అడ్జస్ట్‌మెంట్, మోనోక్రోమ్ ఎంఐడీ డిస్‌ప్లేను డిజైన్‌ చేశారు. ఏఎక్స్‌ (O)7 అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఇన్-బిల్ట్ స్పీకర్లు, టీపీఎంసం, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్‌తో వస్తుంది. ఇంకా, రోల్-ఓవర్ మిటిగేషన్‌తో పాటు హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్‌తో ఈఎస్‌పీ  1.5 డీజిల్ ఏక్స్‌ వేరియంట్‌తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 

మహీంద్రా థార్​ 2డబ్ల్యూడీ ధర..
విడుదలకు సిద్ధంగా ఉన్న మహీంద్రా థార్​ 2డబ్ల్యూడీ ప్రారంభ ధర రూ. 11లక్షలుగా (ఎక్స్​షోరూం) ఉండొచ్చని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు