Mahindra Thar 5-door: మహీంద్రా థార్‌ లాంచ్‌పై కీలక అప్‌డేట్‌.. అప్పటివరకు ఆగాల్సిందే!

30 May, 2023 12:27 IST|Sakshi

మహీంద్రా థార్ (5-డోర్) దేశంలో అత్యంత ఎదురుచూస్తున్న ఎస్‌యూవీ(SUV)లలో ఒకటి. ఇప్పటి వరకు ఈ ఏడాది ఆగస్టు 15న ఈ ఎస్‌యూవీ లాంచ్‌ అవుతుందని పుకారు ఉండేది. అయితే థార్ 5-డోర్ లాంచ్‌ ఎప్పుడనేది కంపెనీ అధికారికంగా ధ్రువీకరించింది. 

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వాహన ప్రియులను మరింత నిరీక్షణలోకి నెట్టేసింది. మహీంద్రా థార్ 5-డోర్ 2024లో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. అలాగే ఈ సంవత్సరం కంపెనీకి సంబంధించిన కొత్త ఉత్పత్తులేవీ లేవని మహీంద్రా అండ్ మహీంద్రా (ఆటో & ఫార్మ్ సెక్టార్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో రాజేష్ జెజురికర్ తెలిపారు.

ఇప్పటికే 50,000లకుపైగా బుకింగ్‌లు

5-డోర్‌ థార్‌కు చాలా డిమాండ్ ఉందని, ఇప్పటికే 50,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు వచ్చాయని జెజురికర్ పేర్కొన్నారు. కస్టమర్ల నిరీక్షణకు తెర దించుతూ 2024 సంవత్సరంలో 5-డోర్‌ థార్‌ను లాంచ్‌ చేయనున్నట్లు వివరించారు.పెంచాలి మరియు ఇప్పుడు మేము 2024లో వచ్చే థార్ 5-డోర్లను చూస్తున్నాము”, జోడించారు.

మహీంద్రా థార్‌కు దేశంలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ ఎస్‌యూవీ డెలివరీ పొందాలంటే కస్టమర్లు మరికొంత కాలం వేచి ఉండాలి. కాగా మహీంద్రా ఈ సంవత్సరం ప్రారంభంలో థార్‌లో RWD 4X2 వెర్షన్‌ను కూడా ప్రారంభించింది.

ఇక మహీంద్రా థార్ 5-డోర్ డిజైన్‌, ఇతర  ప్రత్యేకతల విషయానికి వస్తే పొడవైన స్తంభాలతో బాక్స్‌ లాంటి ఆకారాన్ని కలిగి ఉంటుంది. వాహనం ముందు, వెనుక భాగాలు ప్రస్తుత థార్‌ మాదిరిగానే ఉంటాయని తెలిసింది. అయితే కొత్త 5-డోర్‌ థార్‌లో పొడవైన డోర్లు, వీల్‌బేస్‌తో మరింత విశాలమైన క్యాబిన్‌ ఉంటుంది. సరికొత్త అల్లాయ్ వీల్స్‌, హుడ్ కింద 2.2 లీటర్‌ డీజిల్,  2.0 లీటర్‌ పెట్రోల్ ఇంజన్‌లు ఉంటాయని వెల్లడైంది.

ఇదీ చదవండి: మెర్సిడెస్‌ కొత్త వర్షన్స్‌ భారత్‌కు వచ్చేశాయ్‌! ధరలు ఇవే..

మరిన్ని వార్తలు