బుకింగ్స్ లో మహీంద్ర థార్ దూకుడు

6 Oct, 2020 11:48 IST|Sakshi

సాక్షి, ముంబై  : మహీంద్ర అండ్ మహీంద్ర కొత్తగా మార్కెట్లోకి  తీసుకొచ్చిన ఎస్‌యూవీ  2020 మహీంద్రా థార్  బుకింగ్స్ లో  దూసుకుపోతోంది. కరోనా సంక్షోభంలో వాహన  విక్రయాలు  భారీగా పడిపోయాయి. లాక్ డౌన్ నిబంధనల సడలింపు అనంతరం డిమాండ్ స్వల్పంగా పుంజుకున్నప్పటికీ, ఆటో కంపెనీలు ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో సరికొత్త మహీంద్రా థార్‌కు భారత మార్కెట్ నుంచి  భారీ స్పందన లభిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 9 వేల బుకింగ్స్ ను సాధించామని కంపెనీ తాజాగా ప్రకటించింది. (కొత్త మహీంద్రా థార్ వచ్చేసింది)

అక్టోబర్ 2 న న్యూ-జెన్ థార్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 9000కి పైగా బుకింగ్‌లు అందుకున్నట్లు కంపెనీ తెలిపింది. 18 నగరాల్లో మాత్రమే టెస్ట్ డ్రైవ్ అందుబాటులో ఉన్నప్పటికీ స్పందన బావుందంటూ మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీజయ్ నక్రా సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా టెస్ట్ డ్రైవ్‌లు లభించేలా చూస్తున్నామని తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు