Mahindra Xuv 400 Electric Suv: మహీంద్రా ఎలక్ట్రిక్ కారు.. సింగిల్‌ చార్జ్‌తో 400 కి.మీ ప్రయాణం!

8 Sep, 2022 21:03 IST|Sakshi

దేశంలోని ఆటోమొబైల్‌ రంగంలో మహీంద్రా కంపెనీ కార్లకు ఓ క్రేజ్‌ ఉంది. ఇటీవల మహీంద్రా ఎక్స్‌యువి 700 రికార్డు బుకింగ్స్‌ కావడమే అందుకు ఉదాహరణ. ప్రస్తుతం ట్రెండ్‌కి అనుగుణంగా మహీం‍ద్రా కంపెనీ ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ఎలక్ట్రిక్‌ కార్లను తీసుకురాబోతుంది. అందుకు భాగంగానే మహీంద్రా ఎక్స్‌యూవీ 400 (Mahindra XUV 400) ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ మోడల్‌ లుక్‌ని విడుదల చేసింది.

అయితే మహీం‍ద్రా ఈ కారు విడుదలకు ముందే, టీజర్‌లతో కారుపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 400తో కొంతకాలంగా ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న టాటా నెక్సాన్ SUV వంటి వాటికి గట్టి పోటినే ఇచ్చేలా కనిపిస్తుంది. అయితే ఈ ఈవీ(EV) గురించి కంపెనీ పూర్తి వివరాలు తెలపాల్సి ఉంది. 

సమాచారం ప్రకారం.. కొత్త మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ SUV ధర సుమారు రూ. 14 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. లుక్స్ పరంగా చూస్తే.. మహీంద్రా ఎక్స్‌యూవీ 400.. ఇంటిగ్రేటెడ్ డీఆర్‌ఎల్‌లు, క్లోజ్డ్-ఆఫ్ ఫ్రంట్ గ్రిల్‌తో కూడిన కొత్త హెడ్‌లైట్‌లతో పూర్తిగా రీడిజైన్‌ చేసినట్లు తెలుస్తోంది. సింగిల్‌ ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటారుతో 150హార్స్‌ పవర్‌, రెండు బ్యాటరీ ఆప్షన్స్‌ ఉండే అవకాశం ఉంది.

ఒక సారి ఛార్జింగ్‌పై 400కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చ . 4.2 మీటర్లు పొడవు, XUV 300తో పోలిస్తే స్పేస్‌ పెద్దదని తెలుస్తోంది. ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు. వాటర్‌ ప్రూప్‌ బ్యాటరీ ప్యాక్‌, ప్రతీ చక్రానికి డిస్క్‌ బ్రేకులు, రియర్‌ వ్యూ కెమరా ఇతర ఫీచర్లు ఉంది. దీని టాప్‌ స్పీడ్‌ గంటకు 160 కి.మీ కాగా 8.3 సెకన్లకు 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

చదవండి: టీవీఎస్‌ అపాచీ కొత్త మోడల్‌.. ఆహా అనేలా ఫీచర్లు, స్టైలిష్‌ లుక్‌ అదిరిందయ్యా!

మరిన్ని వార్తలు