Mahindra Born Electric Cars: అదిరిపోయిన మహీంద్రా ఎలక్ట్రిక్‌ కార్లు.. మిగతా కంపెనీలకు దెబ్బే!

15 Aug, 2022 19:20 IST|Sakshi

ఆటోమొబైల్‌ రంగంలో మహీంద్రా కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవల మహీంద్రా ఎక్స్‌యువి 700 రికార్డు బుకింగ్స్‌ అందుకు నిదర్శనం. తాజాగా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ దూసుకెళ్లాలని సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ఎలక్ట్రిక్‌ కార్లను తీసుకురాబోతుంది. అందుకు భాగంగానే మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ( SUV) మోడల్‌ని విడుదల చేసింది.  అయితే ఈ కారు విడుదలకు ముందే, మహీంద్రా వీలు దొరికినప్పుడల్లా టీజర్‌లతో ఈ కారుపై హైప్‌ను పెంచుతోంది. 

ప్రత్యేకంగా చెప్పాలంటే, భారతీయ వాహన తయారీ సంస్థ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను (SUV) విడుదల చేయాలని యోచిస్తోంది. వీటిని ప్రతాప్ బోస్ నేతృత్వంలోని మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్ (M.A.D.E) రూపొందించిందని గమనించాలి.

కంపెనీ దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్‌ల ప్రకారం, SUVలకు XUV-e1, SUV-e2, SUV-e3, SUV-e5, SUV-e6, SUV-e7, SUV-e8. SUV-e9 అని పేరు పెట్టే అవకాశం ఉంది. ట్రేడ్‌మార్క్ చేసిన పేర్లలో 4వ సంఖ్యతో ఉన్న పేరు సిరీస్‌లో లేకుండా పోయింది. మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ SUVల ఫీచర్లు, ఇంటీరియర్‌ల గురించి ఈ టీజర్‌ ద్వారా కస్టమర్లకు క్లూ ఇచ్చింది.

ఇందులో కస్టమర్‌ ప్రాధాన్యతలకు సరిపడా రిక్లైనింగ్ సీట్లు ఉన్నాయి. ఎయిర్ కండిషనింగ్ కోసం వ్యక్తిగత వినియోగదారు సెట్టింగ్‌లు ప్రతి ప్రయాణీకుడు సౌకర్యవంతంగా ఉండేలా చూస్తాయి. స్పష్టమైన కనెక్టివిటీ ఫీచర్‌ల కారణంగా కస్టమర్లు.. కాల్స్‌, టెక్స్ట్‌లు, మ్యూజిక్‌, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను యాక్సెస్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో లెదర్ సీట్లు, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
 

చదవండి: ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్బీఐ: మూడు నెలల్లో మూడోసారి

మరిన్ని వార్తలు