Mahindra XUV400 EV: ఒకే రోజు 400 కార్లు డెలివరీ చేసిన మహీంద్రా.. బుక్ చేసుకున్న వారికి పండగే

25 Mar, 2023 13:39 IST|Sakshi

భారతీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎట్టకేలకు తన XUV400 ఎలక్ట్రిక్ డెలివరీలు ప్రారంభించింది. గుడి పడ్వా సందర్భంగా కంపెనీ మొదటి రోజే ఏకంగా 400 యూనిట్లను డెలివరీ చేసి డెలివరీలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.

వేరియంట్స్ & ధరలు:
2023 ప్రారంభంలో దేశీయ మార్కెట్లో విడుదలైన సరికొత్త ఎలక్ట్రిక్ SUV ఎక్స్‌యూవీ400 మొత్తం EC (3.2kw), EC (7.2kw), EL (7.2kw) అనే మూడు వేరియంట్లలో విడుదలైంది. వీటి ధరలు వరుసగా రూ. 15.99 లక్షలు, రూ. 16.49 లక్షలు, రూ. 18.99 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). కంపెనీ ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు కోసం జనవరిలోనే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది.

కలర్ ఆప్సన్స్:
ఎక్స్‌యూవీ400 ఐదు కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. అవి ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, గెలాక్సీ గ్రే, కాపర్ ఫినిషింగ్‌ రూఫ్‌తో నాపోలి బ్లాక్ మరియు బ్లూ శాటిన్ కలర్లు ఉన్నాయి.

డిజైన్:
మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ కారు కావున కొత్త డిజైన్ పొందుతుంది. దీని ముందు భాగంలోని ఫేక్ ఫ్రంట్ గ్రిల్‌పై కాపర్-కలర్ ఎలక్ట్రిఫైడ్ ట్విన్ పీక్ బ్యాడ్జ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది, అంతే కాకుండా కాపర్ కలర్ ఎలిమెంట్స్ ప్రంట్ బంపర్, సైడ్ డోర్స్, రూఫ్, వెనుక లోగో, ఇంటీరియర్‌లో అక్కడక్కడా కనిపిస్తాయి. 

ఫీచర్స్:
మహీంద్రా ఎక్స్‌యూవీ400 అడ్రినోఎక్స్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌లతో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఏసీ కంట్రోల్స్ వంటి వాటితోపాటు ఇతర ఆధునిక ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

బ్యాటరీ ప్యాక్ & రేంజ్:
ఎక్స్‌యూవీ400 రెండు బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. అవి ఒకటి 34.5kWh బ్యాటరీ కాగా, మరొకటి 39.4kWh బ్యాటరీ ప్యాక్. ఈ రెండూ 150 హెచ్‌పి, 310 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఫ్రంట్ యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 8.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 150 కిమీ. ఈ ఎలక్ట్రిక్ కారులోని 34.5 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్‌తో 375 కిమీ రేంజ్, 39.4 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్‌తో 456 కిమీ రేంజ్ అందిస్తుంది. 

ఛార్జింగ్ ఆప్షన్స్:
మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఫాస్ట్ ఛార్జర్‌ (50kW DC) ద్వారా 50 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది, అదే సమయంలో 7.2kW ఛార్జర్‌ ద్వారా 6 గంటల 30 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. ఇక చివరగా 3.3kW AC ఛార్జర్‌ ద్వారా ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి 13 గంటల సమయం పడుతుంది.

మరిన్ని వార్తలు