కార్ల కొనుగోలు దారులకు భారీ షాక్‌!

13 Jan, 2022 19:09 IST|Sakshi

ప్రముఖ దేశీ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా భారీ షాకిచ్చింది. ఎంపిక చేసిన మహీంద్రా కార్ల ధరల్ని భారీగా పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 

మహీంద్రా అండ్‌ మహీంద్రా గతేడాది అక్టోబర్‌లో ఎక్స్‌ యూవీ 700ని మార్కెట్‌లో విడుదల చేసింది. మార్కెట్‌లో విడుదలైన రెండు రోజుల్లో 50వేల బుకింగ్స్‌తో మహీంద్రా ఆటోమొబైల్‌ సంస్థ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. అయితే పెరిగిపోతున్న బుకింగ్‌ల నేపథ్యంలో కస్టమర్లకు ఈ కార్లను అందించేందుకు సమయం ఉంది.అదే సమయంలో మహీంద్రాతో కస్టమర్లకు భారీ షాక్‌ ఇచ్చింది. తయారీ (ముడి పదార్థాలు మొదలైనవి),రవాణా ఖర్చులు పెరగడంతో మహీంద్రా అండ్‌ మహీంద్రాతో పాటు ఇతర కార్ల సంస్థలు కార్ల ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మహీంద్రా ఎక్స్‌ యూవీ 700 వెహికల్‌ ధరని రూ.80వేల వరకు పెంచింది.  

ఎక్స్‌ యూవీ 700 వెహికల్స్‌ ఫీచర్లు
మహీంద్రా న్యూ లోగోతో రిలీజ్‌ అవుతున్న మొదటి వెహికల్‌  ఎక్స్‌యూవీ700. ఇది పెట్రోల్,  డీజిల్ ఆప్షన్లతో లభిస్తోంది. డీజిల్ వెర్షన్‌లోని 2.2-లీటర్ ఇంజన్ గరిష్ఠంగా 185 పీఎస్‌ శక్తిని, 450 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్ఠంగా 200 పీఎస్‌ శక్తిని, 380 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లేదా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.

ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ ఆధారంగా డ్రైవర్‌ లెస్‌ కారు తెస్తామంటూ టెస్లా అంటోంది. ఆ స్థాయిలో కాకపోయినా ఇండియా వరకు ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ను అధికంగా ఉపయోగిన్న ఆకారుగా మహీంద్రా ఎక్స్‌యూవీ 700ని పేర్కొనవచ్చు. ఇందులో అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెంట్‌ సిస్టమ్‌ని పొందు పరిచారు. దీనిలో ఫార్వర్డ్‌ కొల్యూజన్‌ వార్నింగ్‌, అటానమస్‌ ఎమర్జెన్సీ బ్రేక్స్‌, లైన్‌ డిపాచర్‌ వార్నింగ్‌, లైన్‌ కీప్‌ అసిస్టెంట్‌, అడాప్టిక్‌ క్రూజ్‌ కంట్రోల్‌, ‘డ్రైవర్‌ డ్రౌజీనెస్‌ మానిటర్‌ సిస్టం,  ట్రాఫిక్‌ సిగ్నల్‌ రికగ్నేషన్‌, హై బీమ్‌ అసిస్టెంట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి

చదవండి: ఇదెక్కడి విచిత్రం..! అలవోకగా కారును నడిపేస్తోన్న చేప..!

మరిన్ని వార్తలు