కోర్టు తీర్పు.. మైడెన్ ఫార్మా ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జైలుకి!

28 Feb, 2023 20:48 IST|Sakshi

చాలా సంవత్సరాల క్రితం వియత్నాంకు నాసిరకం మందులను ఎగుమతి చేయడం వల్ల గాంబియాలో ఎంతో మంది పిల్లలు మరణించారు. పిల్లల మరణాలకు దగ్గు సిరప్‌లు కారణమని కొన్ని నెలల తర్వాత ఇద్దరు ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లకు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఇటీవల వెల్లడైంది.

2022 అక్టోబర్‌లో మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌లో తయారీ ప్రమాణాలను ఉల్లంఘించి తయారైన నాలుగు దగ్గు సిరప్‌లు ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఆ తరువాత ఈ విషయం తెలుసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ కేంద్ర ప్రభుత్వంతో చెప్పి ఉత్పత్తిని నిలిపివేసింది.

(ఇదీ చదవండి: భారతదేశ భవిష్యత్తుని మార్చేది ఇలాంటివారే: ఆనంద్ మహీంద్రా)

పిల్లల మరణాలకు గాంబియాలో తమ ఔషధాలే కారణం అనటాన్ని కంపెనీ కండించింది. అంతే కాకుండా గవర్నమెంట్స్ నిర్వహించిన టెస్ట్‌లో కూడా అందులో విషపదార్థాలు లేదని తేలింది. అయినప్పటికీ  కంపెనీ కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంది.

హర్యానా సోనిపట్‌లోని కోర్టు ప్రాసిక్యూషన్ ఆరోపణను సముచితంగా రుజువు చేశారని హార్ట్‌బర్న్ ఔషధాన్ని వియత్నాంకు ఎగుమతి చేసినందుకు కంపెనీ వ్యవస్థాపకుడు నరేష్ కుమార్ గోయెల్, టెక్నికల్ డైరెక్టర్ ఎంకే శర్మలకు జైలు శిక్ష విధించింది. అయితే పై కోర్టులో అప్పీలు చేసుకోవడానికి కోర్టు 2023 మార్చి 23 వరకు గడువు ఇచ్చింది.

రెనిటిడిన్ టాబ్లెట్స్ బిపి (మాంటెక్-150) మెడిసిన్ వియత్నాంకు ఎగుమతి చేసినందుకు ఇద్దరికి ఒక్కొక్కరికి లక్ష జరిమానా విధించారు.అయితే గోయెల్ కాల్‌లకు సమాధానం ఇవ్వలేదు. అయితే ఎంకే శర్మ సంప్రదింపు వివరాలను అందించడానికి నిరాకరించినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు