Vijay Mallya: ఇదే లాస్ట్‌ ఛాన్స్‌..! విజయ్‌ మాల్యాకు సుప్రీంకోర్టు గట్టి వార్నింగ్‌..!

11 Feb, 2022 12:23 IST|Sakshi

సుమారు 9 వేల కోట్లను బ్యాంకులకు ఎగొట్టి బ్రిటన్‌కు పారిపోయినా కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ మాల్యాపై సుప్రీంకోర్డు మండిపడింది. ఇదే లాస్ట్‌ చాన్స్‌ అంటూ అపెక్స్‌ కోర్టు విజయ్‌ మాల్యాను హెచ్చరించింది. 

కోర్టు ధిక్కరణ కేసులో..!
విజయ్‌ మాల్యా కోర్టు ధిక్కరణ కేసులో హాజరు అయ్యేందుకు సుప్రీంకోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది. కాగా కోర్టు నిర్ణయాన్ని పట్టించుకొని​ విజయ్‌ మాల్యా ఇప్పటి వరకు కోర్టు ముందుకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు మాల్యాకు ఇదే చివరి అవకాశం అంటూ స్పష్టం చేసింది. ఈ కేసుతో పాటుగా మనీలాండరింగ్ కేసు విచారణను కూడా  ఈనెల 24కు వాయిదా వేసింది. 24 లోగా వ్యక్తిగతంగా లేదా ఆయన తరపున న్యాయవాది కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది అపెక్స్‌ కోర్టు. హాజరుకాకపోతే ఈ కేసు ముగింపునకు సంబంధించి తామే తుది నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 

ఆదేశాలను ఉల్లంఘిస్తూ..!
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేసి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. 2017లో కోర్టును ధిక్కరించారని కోర్టు గుర్తించింది. ధిక్కరణలో భాగంగా గత నాలుగు నెలల నుంచి శిక్ష ఖరారు మాత్రమే పెండింగ్‌లో ఉంది.  యూకే నుంచి మాల్యాను భారత్‌కు రప్పించే అంశం తుది అంకానికి చేరుకుందని కేంద్రం కోర్టుకు తెలపగా, విజయ మాల్యా ఇండియాకు వచ్చే విషయంపై ఇంకా స్పష్టత లేదు. 

చదవండి:  విజయ మాల్యా కేసులో కీలక మలుపు..!

మరిన్ని వార్తలు