షేర్స్ కొనడానికి రూ. లక్ష అడిగిన యూజర్ - ఆనంద్ మహీంద్రా అదిరిపోయే రిప్లై

27 Dec, 2023 18:06 IST|Sakshi

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) దృష్టిని ఇటీవల ఓ వ్యక్తి ఆక‌ర్షించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్ట్‌లో యూజ‌ర్ చేసిన కామెంట్ హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో సర్, మహీంద్రా గ్రూప్ షేర్లను కొనుగోలు చేయడానికి నాకు 1 లక్ష రూపాయలు కావాలి' అని అడిగినట్లు చూడవచ్చు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. నీ ధైర్యానికి అభినంద‌న‌లు, ఆలా అడగడంలో తప్పేముందని అన్నారు. యూజర్ అడిగిన ప్రశ్నకు తెలివిగా సమాధానం ఇచ్చిన ఆనంద్ మహీంద్రాను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. 

నిజానికి ఆనంద్ మహీంద్రా ఇలాంటి సంఘటనల మీద స్పందించడం ఇదే మొదటి సారి కాదు. ఇటీవల ఓ పిల్లాడు 700 రూపాయలకు మహీంద్రా థార్ కొంటానని వాళ్ళ నాన్నతో చేసిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ఇదీ చదవండి: మహీంద్రా థార్ పేరు మారనుందా..? కొత్త పేరు ఏదంటే!

ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. చీకూ వీడియోలను చాలానే చూసాను, ఇప్పుడు అతడంటే ఇష్టం ఏర్పడింది. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే.. థార్‌ను 700 రూపాయలకు విక్రయిస్తే.. మేము త్వరలో దివాళా తీయాల్సి ఉంటుందని సరదాగా అన్నారు.

 

>
మరిన్ని వార్తలు