ట్విటర్‌లో పెట్టుబడులకు ఇన్వెస్టర్ల ఆసక్తి

7 May, 2022 16:44 IST|Sakshi

శాన్‌ ఫ్రాన్సిస్కో: మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ను కొనుగోలు యత్నాల్లో ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్‌ ఈలాన్‌ మస్క్‌కు బాసటగా పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. ఒరాకిల్‌ సహ వ్యవస్థాపకుడు, టెస్లా బోర్డు సభ్యుడు ల్యారీ ఎలిసన్‌ సహా పలువురు ఏకంగా 7.1 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయడానికి ముందుకొచ్చారు. ఎలిసన్‌ (1 బిలియన్‌ డాలర్లు), సెకోయా క్యాపిటల్‌ ఫండ్‌ (800 మిలియన్‌ డాలర్లు), వైక్యాపిటల్‌ (700 మిలియన్‌ డాలర్లు) మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి.  ట్విటర్‌ మాజీ సీఈవో జాక్‌ డోర్సీ సహా పలువురితో మస్క్‌ చర్చలు జరుపుతున్నారు.

ఒకవేళ ఈ పెట్టుబడులు సాకారమైతే.. ట్విటర్‌ కొనుగోలు కోసం మస్క్‌ తీసుకోవాల్సిన రుణాల భారం దాదాపు సగానికి తగ్గుతుంది. నగదు, ఈక్విటీ రూపంలో చెల్లించే పరిమాణం 21 బిలియన్‌ డాలర్ల నుంచి 27.25 బిలియన్‌ డాలర్లకు చేరుతుంది. దాదాపు 44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు మస్క్‌ ఆఫర్‌ ఇచ్చారు.   

చదవండి: ఎలన్ మస్క్‌-ట్విటర్‌ భారీ డీల్‌లో ట్విస్ట్‌.. కోర్టుకెక్కిన వాటాదారు

మరిన్ని వార్తలు