డిమాండ్ దెబ్బకి ఓలా ఎలక్ట్రిక్ సైట్ బ్లాక్!

16 Jul, 2021 18:13 IST|Sakshi

త్వరలో మార్కెట్లోకి తీసుకొనిరాబోయే ఈ-స్కూటర్ల కోసం నిన్న ఓలా ఎలక్ట్రిక్ రూ.499కి బుకింగ్స్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా నిన్న బుకింగ్స్ ఓపెన్ అయ్యాయో లేదో విపరీతంగా డిమాండ్ ఏర్పడటంతో కంపెనీ సైట్ లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించిన వినియోగదారులు సమస్యలు ఎదుర్కొన్నారు. దీని గురుంచి ఓలా కో-ఫౌండర్ భవిష్ అగర్వాల్ ట్విట్టర్ లో క్షమాపణ లు కోరారు. పోర్టల్ లో లాగిన్ అయ్యేందుకు ఒకేసారి ఎక్కువ మంది ప్రయత్నించడంతో సైట్ బ్లాక్ అయ్యినట్లు అగర్వాల్ పేర్కొన్నారు.     

"మొదట్లో సమస్యలను ఎదుర్కొన్న వారికి క్షమాపణలు! మేము ఈ డిమాండ్ ను ఊహించలేదు. వెబ్ సైట్ లో తగినంత స్కేలబిలిటీని ప్లాన్ చేయలేదు. అన్నీ ఇప్పుడు పరిష్కరించబడ్డాయి" అని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ రాశారు. సంస్థ రాబోయే తన ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో భారీగా బజ్ క్రియేట్ చేసింది అని చెప్పుకోవాలి. ఈ నెల చివరలో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తమిళనాడులో నిర్మిస్తున్న ఈ ఫెసిలిటీలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తున్నారు. ఈ ఫెసిలిటీ సెంటర్ ప్రపంచంలో ఉన్న ఫెసిలిటీ సెంటర్లు కంటే పెద్దది. ఇక్కడ ఏడాదికి ఒక కోటి యూనిట్లను తయారు చేసే సామర్ధ్యం ఉంది. ఇక్కడి నుంచి లాటిన్ అమెరికా, యుకె, న్యూజిలాండ్, ఇతరుల మార్కెట్లకు ఎగుమతులు చేయాలని చూస్తున్నారు.

>
మరిన్ని వార్తలు