బంగారం ధరలు ఎంత పెరిగాయంటే

8 Mar, 2021 14:28 IST|Sakshi

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తాజాగా స్వల్పంగా పెరిగాయి. పసిడి ధరలు నెల రోజుల కనిష్ట ధరలు నమోదు చేసిన తరువాత పుంజుకుంటున్నాయి. మరోవైపు ఆల్‌టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసిన వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.310 పెరిగి 44,725 చేరుకుంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగి రూ.40,970కి చేరుకుంది. ఇక, తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్‌లో కూడా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 

తాజాగా రూ.320 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.45,820 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.290 పెరగడంతో బంగారం ధర రూ.42,000 అయింది. గోల్డ్  మార్కెట్‌లో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధర రూ.720 మేర పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.65,850కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.900 మేర పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.71,000కు చేరుకుంది. అయితే తాజా ధరలు పరిస్థితులను బట్టి ధరల్లో మార్పు చేర్పులు ఉంటాయి.

చదవండి:
కరోనాతో ప్రజలకు రూ.13లక్షల కోట్ల నష్టం!

మరిన్ని వార్తలు