471 శాతం ఎగిసిన బంగారం దిగుమతులు

2 Apr, 2021 13:42 IST|Sakshi

 ఫిబ్రవరిలో బంగారంపై దిగుమతి పన్ను కోతఆల్‌టైం  హై నుంచి  క్షీణించిన ధరలు రీటైల్‌,  వ్యాపారులనుంచిపెరిగి డిమాండ్‌ ఏప్రిల్‌లో  దిగుమతులుపడిపోతాయనే ఆందోళన

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉన్నభారత్‌లో  మార్చి నెలలో రికార్డు దిగుమతులనునమోదు  చేసింది. గత నెలలో భారతదేశ బంగారు దిగుమతులు 471 శాతం ఎగిసి రికార్డు స్థాయిలో160  పుంజుకున్నాయని  ప్రభుత్వ వర్గాలు గురువారం రాయిటర్స్‌తో చెప్పాయి. దిగుమతి పన్నుల తగ్గింపు, పుత్తడి ధరలు  రికార్డు స్థాయినుంచి దిగి వచ్చిన నేపథ్యంలో రీటైల్‌ కొనుగోలుదారులు, జ్యుయల్లర్ల నుంచి డిమాండ్‌  ఊపందుకోవడమే దీనికికారణమని పేర్కొంది.   2020 ఆగస్టులో ఆల్-టైమ్ హై దాదాపు 17శాతం పసిడి ధరలు   దిద్దుబాటునకు గురైనాయి. పసిడి దిగుమతుల పెరుగుదల భారతదేశ వాణిజ్య లోటును పెంచుతుంది. అలాగే  డాలరు మారకంలో రూపాయి విలువనుప్రభావితం చేస్తుంది. 

మార్చి త్రైమాసికంలో భారత్ రికార్డు స్థాయిలో 321 టన్నులు  బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అంతకుముందు ఏడాది ఇది 124 టన్నులు.  ఏడాది క్రితం 1.23 బిలియన్ డాలర్ల నుంచి  ప్రస్తుతం బంగారం దిగుమతులు  8.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని పేరు  చెప్పడానికి ఇష్టపడని అధికారి వెల్లడించారు. రిటైల్ డిమాండ్ పెంచేందుకు,  దేశంలోకి అక్రమ రవాణాను తగ్గించడానికి ఫిబ్రవరిలో బంగారంపై దిగుమతి సుంకాలను 12.5శాతం నుండి 10.75శాతానికి కేంద్రం  తగ్గించింది. అధిక ధరల కారణంగా చాలా మంది వినియోగదారులు కొనుగోలును వాయిదా వేసుకున్నారనీ, ధరలు బాగా దిగిరావడంతో కొనుగోళ్లకుఎగబడ్డారని కోల్‌కతా నగరంలోని హోల్‌సేల్ వ్యాపారి జెజె గోల్డ్ హౌస్ యజమాని హర్షద్ అజ్మెరా అన్నారు. మార్చిలో, స్థానిక బంగారు ఫ్యూచర్స్ 10 గ్రాములక పుత్తడి ధర రూ. 43,320  వద్ద  ఏడాది కనిష్టానికి చేరిన సంగతి తెలిసిందే.  

మరోవైపు  దేశంలో రెండోదశలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్‌లో భారత బంగారం దిగుమతులు 100 టన్నులకంటే తక్కువగానే  ఉండనున్నాయని  ఆభరణాల వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాను అదుపుచేసేందుకు  ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధిస్తే  దిగుమతులు ప్రభావితం కానున్నాయని ఒక డీలర్  అభిప్రాయపడ్డారు.  కాగా  దేశంలో  శుక్రవారం (ఏప్రిల్‌ 2)  వెలువరించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు ప్రకారం ఒక్కరోజులోనే  72,330  కొత్త కేసులు నమోదయ్యాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు