మార్గరెట్‌- షేక్‌స్పియర్‌.. వీళ్లెవరో తెలుసా?

8 Dec, 2020 15:06 IST|Sakshi

యూకేలో తొలిసారి వ్యాక్సిన్‌ తీసుకున్న పౌరులు

మార్గరెట్ కీనన్‌కు 90 ఏళ్ల వయసులో వ్యాక్సిన్‌

వ్యాక్సిన్‌‌ వేయించుకున్న రెండో వ్యక్తి విలియం షేక్‌స్పియర్‌

యూకేలో ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ పంపిణీ షురూ

లండన్‌: కోవిడ్‌-19 కట్టడికి జర్మన్‌ కంపెనీ బయోఎన్‌టెక్‌తో కలసి ఫైజర్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ పంపిణీ యూకేలో ప్రారంభమైంది. గత వారం ఔషధాలు, ఆరోగ్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థ(ఎంహెచ్‌ఆర్ఏ) ఇందుకు అనుమతించడంతో యూకే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వెరసి ప్రపంచంలోనే తొలిసారిగా 90 ఏళ్ల మహిళ మార్గరెట్‌ కీనన్‌.. ఫైజర్‌ వ్యాక్సిన్‌ను అందుకున్నారు. ఎన్నీస్కిల్లెన్‌కు చెందిన మార్గరెట్‌తో వ్యాక్సిన్‌ల పంపిణీ ప్రారంభంకాగా.. ఇందుకు తానెంతో గర్విస్తున్నట్లు మార్గరెట్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన మార్గరెట్‌కు కోవెంట్రీ యూనివర్శిటీ ఆసుపత్రిలో వ్యాక్సిన్‌ను అందించారు. కాగా.. మార్గరెట్‌ తదుపరి వార్విక్‌షైర్‌కు చెందిన విలియం షేక్‌స్పియర్‌ అనే వ్యక్తి వ్యాక్సిన్‌ వేయించుకున్న రెండోవ్యక్తిగా నిలవడం విశేషం! చదవండి: (జనవరి 1 నుంచి విప్రో వేతన పెంపు!)

తప్పనిసరికాదు
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు యూకే ప్రభుత్వం ఫైజర్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను అనుమతించినప్పటికీ ఇది తప్పనిసరికాదని విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. వ్యాక్సిన్‌ను భారీ స్థాయిలో అందించేందుకు లాజిస్టిక్స్‌ విభాగంలో పలువురు రోజంతా పనిచేస్తున్నట్లు జాతీయ ఆరోగ్య సేవల సంస్థ(ఎన్‌హెచ్‌ఎస్‌) పేర్కొంది. ఫైజర్‌ అభివృద్ధి చేసిన కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ ఫార్ములాతో రూపొందిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు