సగం సంపద ఆవిరైంది.. సంతోషంగా ఉందంటూ పోస్ట్‌ పెట్టిన మార్క్‌ జుకర్‌బర్గ్‌!

22 Sep, 2022 10:26 IST|Sakshi

ఫేస్‌బుక్ వ్యవస్థాపక సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ భారీగా సంపద కోల్పోయి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవల తన సంపద ఊహించిన స్థాయిలో కరిగిపోవడం, కంపెనీ షేర్లు కూడా పతనం వైపు పరుగులు పెట్టడం వంటి ఘటనలతో విచారంలో ఉన్న తనకి ఓ గుడ్‌ న్యూస్‌ పలకరిస్తూ ఊరటనిచ్చింది. జుకర్‌బర్గ్‌ మూడోసారి తండ్రి కాబోతున్నాడు. తన భార్య ప్రిస్సిల్లా చాన్‌ గర్భవతి అయ్యిందని, ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

అందులో.. “లాట్స్‌ ఆఫ్‌ లవ్‌. వచ్చే ఏడాది మాక్స్, ఆగస్ట్‌లకు చెల్లెలిని రాబోతోందని ఈ గుడ్‌ న్యూస్‌ పంచుకోవడానికి సంతోషంగా ఉందని” పోస్ట్‌ చేశారు. మార్క్‌ జుకర్‌బర్గ్, ప్రిస్సిల్లా చాన్ 2003లో హార్వర్డ్ యూనివర్శిటీ ఫ్రాట్ పార్టీలో కలుసుకున్న తర్వాత డేటింగ్ ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి రిలేషన్‌లో ఉన్న వీరు 2012లో వివాహం చేసుకున్నారు. ఇటీవలే వారి 10వ వివాహ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు- ఆగస్ట్, మాక్సిమా.

మెటా’ అభివృద్ధి, రీబ్రాండింగ్‌పై దృష్టిపెట్టడంతో జుకర్‌బర్గ్‌కు సంపద భారీగా క్షీణించిన సంగతి తెలిసిందే. ఫలితంగా కేవలం 55.9 బిలియన్ డాలర్ల నికర విలువతో ఇటీవల ప్రపంచ బిలియనీర్‌లలో 20వ స్థానంలో నిలిచారు. ఈ పరిణామాలతో మార్క్‌ సగం సంపద వరకు కోల్పోయాడు. 2014 నుండి ఆయనకిదే అత్యల్ప స్థానం కావడం గమనార్హం. రెండేళ్ల కిందట మార్క్‌ సంపద 106 బిలియన్ డాలర్లుగా ఉంది.

A post shared by Mark Zuckerberg (@zuck)

చదవండి: కరోనా ఎఫెక్ట్‌: ఆ కేటగిరి అద్దె ఇళ్లకు ఫుల్‌ డిమాండ్‌.. టూ కాస్ట్‌లీ గురూ!

మరిన్ని వార్తలు