డబుల్‌ సెంచరీతో సెన్సెక్స్‌ షురూ

23 Oct, 2020 09:51 IST|Sakshi

177 పాయింట్లు అప్‌- 40,735కు సెన్సెక్స్‌

55 పాయింట్లు ఎగసి 11,952 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం ప్లస్‌

ఒక్క రోజు వెనకడుగు తదుపరి దేశీ స్టాక్‌ మార్కెట్లు తిరిగి జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ సాధించింది. ప్రస్తుతం 177 పాయింట్లు ఎగసి 40,735కు చేరింది. నిఫ్టీ 55 పాయింట్లు పుంజుకుని 11,952 వద్ద ట్రేడవుతోంది. ఆర్థిక గణాంకాల ప్రోత్సాహంతో గురువారం యూఎస్‌ మార్కెట్లు 0.5 శాతం లాభపడగా.. ప్రస్తుతం ఆసియాలోనూ అధిక శాతం మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా కేంద్ర ప్రభుత్వం మరోసారి సహాయక ప్యాకేజీని ప్రకటించనుందన్న అంచనాలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,811- 40,692 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,975- 11,939 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది.

రియల్టీ వీక్
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 1-0.3 శాతం మధ్య పుంజుకోగా.. రియల్టీ నామమాత్ర నష్టంతో కదులుతోంది. నిఫ్టీ దిగ్గజాలలో సిప్లా, టాటా స్టీల్‌, ఐవోసీ, గ్రాసిమ్‌, మారుతీ, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఫిన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ, ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇండస్‌ఇండ్‌, కోల్‌ ఇండియా, దివీస్‌, సన్‌ ఫార్మా, కొటక్‌ బ్యాంక్‌ 2-0.8 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే గెయిల్‌, శ్రీ సిమెంట్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌ 0.6-0.2 శాతం మధ్య నీరసించాయి.

ఇన్‌ఫ్రాటెల్‌ అప్‌
డెరివేటివ్స్‌లో ఇన్‌ఫ్రాటెల్‌, ఐబీ హౌసింగ్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఐడియా, ఎస్కార్ట్స్‌, అదానీ ఎంటర్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, మదర్‌సన్‌, భెల్‌, జీ 3.5-1.8 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోపక్క అపోలో హాస్పిటల్స్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, కోఫోర్జ్‌, టొరంట్‌ పవర్‌, ముత్తూట్‌, అశోక్‌ లేలాండ్‌, బయోకాన్‌, రామ్‌కో సిమెంట్‌, పెట్రోనెట్‌, అంబుజా 1.4-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,273 లాభపడగా.. 472 మాత్రమే నష్టాలతో ట్రేడవుతున్నాయి.

మరిన్ని వార్తలు