లాభాలతో షురూ- బ్యాంకింగ్ జోరు

10 Sep, 2020 09:38 IST|Sakshi

265 పాయింట్లు అప్‌- 38,459కు సెన్సెక్స్‌

73 పాయింట్లు ప్లస్‌- 11,351 వద్ద నిఫ్టీ ట్రేడింగ్‌

ఫార్మా డీలా- బ్యాంకింగ్‌, రియల్టీ, ఆటో, ఐటీ గుడ్‌

బీఎస్‌ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1-1.6 శాతం జోరు

ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. సెన్సెక్స్‌ 265 పాయింట్లు జంప్‌చేసి 38,459 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 73 పాయింట్లు ఎగసి 11,351కు చేరింది. మూడు రోజుల పతనానికి బుధవారం చెక్‌ పెడుతూ యూఎస్‌ మార్కెట్లు హైజంప్‌ చేశాయి. దీంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా నష్టాలకు చెక్‌ పడినట్లు తెలియజేశారు. ట్రేడర్లు షార్ట్‌కవరింగ్‌ చేపట్టడంతో అటు యూఎస్‌, ఇటు దేశీ మార్కెట్లు రీబౌండ్‌ అయినట్లు వివరించారు.

ఫార్మా మాత్రమే
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా 0.15 శాతం బలహీనపడగా.. మిగిలిన అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌, రియల్టీ, మీడియా, ఆటో, ఐటీ 1-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఆర్‌ఐఎల్‌, బజాజ్‌ ఫిన్‌, యాక్సిస్‌, గెయిల్‌, ఐసీఐసీఐ, ఎంఅండ్‌ఎం 3.4-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే యూపీఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, బజాజ్‌ ఆటో, ఎన్‌టీపీసీ, జీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా 1-0.25 శాతం మధ్య నీరసించాయి.

ఫైనాన్స్‌ భేష్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఐడిఎఫ్‌సీ ఫస్ట్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌,  కెనరా బ్యాంక్‌, నాల్కో, మణప్పురం, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఐడియా 3-2 శాతం మధ్య జంప్‌ చేశాయి. కాగా.. మ్యాక్స్‌ ఫైనాన్స్‌, ఎస్కార్ట్స్‌, కంకార్‌, భారత్  ఫోర్జ్‌, కేడిలా హెల్త్‌ 1.2-0.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1-1.6 శాతం మధ్య ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1228 లాభాలతోనూ, 237 నష్టాలతోనూ కదులుతున్నాయి.

>
మరిన్ని వార్తలు