మార్కెట్‌ బౌన్స్‌బ్యాక్‌- మిడ్‌ క్యాప్స్‌ రికార్డ్‌‌

7 Jan, 2021 10:14 IST|Sakshi

276 పాయింట్లు అప్‌‌- 48,450కు చేరిన సెన్సెక్స్

85 పాయింట్లు ఎగసి 14,231 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ

మెటల్‌, రియల్టీ, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్‌ జూమ్‌

బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 1.2 శాతం అప్‌

ముంబై, సాక్షి: ఒక్క రోజులోనే మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ సాధించాయి. ముందురోజు నమోదైన నష్టాల నుంచి కోలుకుని తిరిగి ర్యాలీ బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 276 పాయింట్లు పెరిగి 48,450కు చేరింది. నిఫ్టీ సైతం 85 పాయింట్లు లాభపడి 14,231 వద్ద ట్రేడవుతోంది. 10 రోజుల వరుస ర్యాలీకి బుధవారం బ్రేక్‌ పడినప్పటికీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లకు దిగడంతో ప్రారంభంలోనే మార్కెట్లు జోరందుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 48,558 ఎగువన, నిఫ్టీ 14,256 వద్ద గరిష్టాలను చేరాయి. ఎన్‌ఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 21,962 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకడం విశేషం! కోవిడ్‌-19 కట్టడికి వ్యాక్సిన్ల అందుబాటు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వెల్లువ వంటి అంశాలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇటీవల మార్కెట్లు నిరవధిక ర్యాలీ బాటలో సాగుతుండటంతో ట్రేడర్లు కొంతమేర అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు.  (టాటా క్లిక్‌లో టాటా గ్రూప్‌ భారీ పెట్టుబడులు)

ఐటీ, ఫార్మా వీక్
ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌, రియల్టీ, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 3-1.3 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఐటీ, ఫార్మా 0.5-0.2 శాతం చొప్పున డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్‌, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎయిర్‌టెల్‌, అదానీ పోర్ట్స్, ఐషర్‌, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్‌, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, యాక్సిస్‌, ఆర్‌ఐఎల్‌ 5-1.5 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో టైటన్‌, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, నెస్లే, టెక్‌ మహీంద్రా, దివీస్‌, సన్‌ ఫార్మా, కొటక్‌ బ్యాంక్‌ 1.3-0.4 శాతం మధ్య క్షీణించాయి. 

భారత్‌ ఫోర్జ్‌ అప్‌
డెరివేటివ్‌ స్టాక్స్‌లో భారత్‌ ఫోర్జ్‌, అశోక్‌ లేలాండ్‌, జిందాల్‌ స్టీల్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, ఎన్‌ఎండీసీ, అపోలో టైర్‌, సెయిల్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, ఐబీ హౌసింగ్‌ 7-4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క మైండ్‌ట్రీ, మ్యాక్స్‌ ఫైనాన్స్, కోఫోర్జ్‌, అరబిందో, ఐసీఐసీఐ లంబార్డ్‌, హెచ్డీఎఫ్‌సీ ఏఎంసీ 2-0.6 శాతం మధ్య నీరసించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 1.2 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ 1,894 షేర్లు లాభపడగా.. 523 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. 

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 484 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 380 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 986 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 490 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1,843 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 715 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 

మరిన్ని వార్తలు