ఆటుపోట్ల మధ్య చివరికి నష్టాలు

23 Sep, 2020 16:06 IST|Sakshi

66 పాయింట్ల నష్టం- 37,668 వద్ద నిలిచిన సెన్సెక్స్‌

తొలుత 400 పాయింట్లు అప్‌- ఆపై 400 పాయింట్లు డౌన్‌

22 పాయింట్లు క్షీణించి 11,132 వద్ద ముగిసిన నిఫ్టీ

ఇంట్రాడేలో 11,260- 11,024 మధ్య నిఫ్టీ ఊగిసలాట

బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.3 శాతం వీక్‌

మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌ బోర్లా- రియల్టీ ప్లస్

వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ తొలుత హైజంప్‌ చేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి.  సెన్సెక్స్‌ 66 పాయింట్లు క్షీణించి 37,668 వద్ద నిలవగా.. నిఫ్టీ 22 పాయింట్లు తక్కువగా 11,132 వద్ద స్థిరపడింది. అయితే తొలుత సెన్సెక్స్‌ 400 పాయింట్లు ఎగసి 38,140ను తాకింది. మిడ్‌సెషన్‌కల్లా అమ్మకాలు ఊపందుకోవడంతో లాభాలు పోగొట్టుకోవడంతోపాటు.. 400 పాయింట్లు పతనమైంది. వెరసి 37,313కు చేరింది. ఇదే విధంగా ఇంట్రాడేలో నిఫ్టీ 11,260 వద్ద గరిష్టాన్ని తాకగా.. 11,024 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇటీవల పతన బాటలో సాగిన దేశీ మార్కెట్లలో ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగడంతో తొలుత ఇండెక్సులు ఊపందుకున్నట్లు నిపుణులు తెలియజేశారు. సెప్టెంబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ గురువారం ముగియనుండటం ప్రభావం చూపినట్లు పేర్కొన్నారు. అయితే అంతర్గతంగా సెంటిమెంటు బలహీనంగా ఉండటంతో చివర్లో అమ్మకాలదే పైచేయిగా నిలిచినట్లు అభిప్రాయపడ్డారు.

ప్రయివేట్‌ బ్యాంక్స్‌ ఓకే
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2.4-1.5 శాతం మధ్య క్షీణించగా.. రియల్టీ 0.8 శాతం, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 0.2 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్‌, కోల్‌ ఇండియా, గెయిల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌, నెస్లే, బ్రిటానియా, టైటన్, ఆర్‌ఐఎల్‌, మారుతీ, హిందాల్కో, విప్రో, కొటక్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐషర్‌, ఎల్‌అండ్‌టీ, యూపీఎల్‌ 2.5-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్‌, ఎయిర్‌టెల్‌ 8.2 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇతర కౌంటర్లలో టాటా స్టీల్‌, జీ, ఇండస్‌ఇండ్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌, ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హీరో మోటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, సన్‌ ఫార్మా, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ 3.5-1 శాతం వెనకడుగు వేశాయి. 
 
టాటా కెమ్‌ అప్
డెరివేటివ్‌ కౌంటర్లలో టాటా కెమ్‌, పేజ్‌, టాటా పవర్‌, ముత్తూట్‌, జిందాల్‌ స్టీల్‌, ఇండిగో, కోఫోర్జ్‌, బాష్‌, గ్లెన్‌మార్క్‌, బాలకృష్ణ, వేదాంతా, రామ్‌కో సిమెంట్‌ 7.3-2.4 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు ఐడియా, సన్‌ టీవీ, శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, భెల్‌, మదర్‌సన్, టాటా కన్జూమర్‌, టొరంట్‌ ఫార్మా, లుపిన్‌, మారికో, అరబిందో, ఐబీ హౌసింగ్‌, కేడిలా 11-2.4 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.3 శాతం డీలా పడింది. ట్రేడైన షేర్లలో 1,217లాభపడగా.. 1,416 నష్టాలతో ముగిశాయి. 

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,073 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 879 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 540 కోట్లు, డీఐఐలు రూ. 518 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 

మరిన్ని వార్తలు