ఆద్యంతం ఆటుపోట్లు- స్వల్ప లాభాలతో సరి

7 Sep, 2020 15:58 IST|Sakshi

60 పాయింట్లు ప్లస్‌-38,417కు సెన్సెక్స్‌

21 పాయింట్లు బలపడి 11,355 వద్ద నిలిచిన నిఫ్టీ 

ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా 0.6-0.3 శాతం అప్‌

రియల్టీ, ఆటో, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 1-0.4 శాతం డౌన్‌

0.8-0.2 శాతం నీరసించిన బీఎస్‌ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్

నేలచూపులతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆద్యంతం ఆటుపోట్ల మధ్య కదిలాయి. చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 60 పాయింట్లు బలపడి 38417 వద్ద నిలవగా.. నిఫ్టీ 21 పాయింట్లు పుంజుకుని 11,355 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,520 వద్ద గరిష్టాన్ని తాకగా, 38,061 దిగువన కనిష్టాన్నీ చేరింది. నిఫ్టీ సైతం  11,381- 11,252 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. వారాంతాన వరుసగా రెండు రోజు యూఎస్‌ మార్కెట్లు పతనంకావడం, చైనాతో సరిహద్దు వద్ద సైనిక వివాదాల కారణంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.  

రియల్టీ వీక్
ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా 0.6-0.3 శాతం మధ్య బలపడ్డాయి. రియల్టీ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఆటో రంగాలు 1-0.4 శాతం మధ్య క్షీణించాయి.  నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ప్రాటెల్‌ 6 శాతం జంప్‌చేయగా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, డాక్టర్‌ రెడ్డీస్, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఆర్‌ఐఎల్‌, యాక్సిస్‌, జీ, విప్రో 3.2-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఎంఅండ్‌ఎం, యూపీఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, గెయిల్‌, ఎన్‌టీపీసీ, హీరో మోటో, అల్ట్రాటెక్‌, ఓఎన్‌జీసీ, ఎయిర్‌టెల్, శ్రీ సిమెంట్, ఇండస్‌ఇండ్‌, గ్రాసిమ్‌, సిప్లా, ఎల్‌అండ్‌టీ, బీపీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌ 3.6-0.6 శాతం మధ్య వెనకడుగు వేశాయి. 

ఐడియా జోరు
డెరివేటివ్స్‌లో ఐడియా, హావెల్స్‌, ఏసీసీ, బాష్‌, వేదాంతా, మదర్‌సన్‌, టీవీఎస్‌ మోటార్‌, సన్‌ టీవీ, బీవోబీ, అంబుజా, ఐసీఐసీఐ ప్రు, మైండ్‌ట్రీ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. మరోవైపు టాటా కన్జూమర్‌, మణప్పురం, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, జిందాల్‌ స్టీల్‌, చోళమండలం, ఎస్కార్ట్స్‌, బంధన్‌ బ్యాంక్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌,పీవీఆర్‌ 4.3-2.5 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.8-0.2 శాతం బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1491 నష్టపోగా.. 1227 లాభాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,889 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 457 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! గురువారం ఎఫ్‌పీఐలు నామమాత్రంగా రూ. 8 కోట్లు,  డీఐఐలు స్వల్పంగా రూ. 120 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి కాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 991 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 657 కోట్లకుపైగా అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.  

మరిన్ని వార్తలు