చివరికి అక్కడక్కడే- మిడ్‌ క్యాప్స్‌ జూమ్‌

13 Aug, 2020 16:01 IST|Sakshi

59 పాయింట్లు డౌన్‌- 38,310కు సెన్సెక్స్‌ 

8 పాయింట్లు మైనస్‌- 11,300 వద్దకు నిఫ్టీ 

మిడ్‌, స్మాల్ క్యాప్స్‌ 1.6-0.8 శాతం అప్‌

మీడియా, ఆటో, మెటల్‌, రియల్టీ  శాతం ప్లస్

విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి బలహీనపడ్డాయి. చివరికి సెన్సెక్స్‌ 59 పాయింట్లు తక్కువగా 38,310 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 8 పాయింట్లు నీరసించి 11,300 వద్ద నిలిచింది. యూఎస్‌, ఆసియా మార్కెట్లు లాభపడటంతో తొలుత సెన్సెక్స్‌ 38,517 వరకూ ఎగసింది. మధ్యాహ్నం నుంచీ అమ్మకాలు పెరగడంతో 38,215 వరకూ వెనకడుగు వేసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 11,359 వద్ద గరిష్టాన్ని తాకగా.. 11,270 వద్ద కనిష్టాన్ని చేరింది.
  
పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా డీలా
ఎన్‌ఎస్‌ఈలో మీడియా, ఆటో, మెటల్‌, రియల్టీ రంగాలు 1.4-1 శాతం లాభపడ్డాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా 1 శాతం చొప్పున క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, ఎల్‌అండ్‌టీ, హిందాల్కో, టైటన్‌, ఇన్‌ఫ్రాటెల్, అదానీ పోర్ట్స్‌, హీరో మోటో, ఎన్‌టీపీసీ, ఐవోసీ, అల్ట్రాటెక్‌, టెక్‌ మహీంద్రా 4.6-1 శాతం మధ్య ఎగశాయి. అయితే సన్‌ ఫార్మా, ఐషర్‌,  ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఐటీసీ, గెయిల్‌, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ 2-0.4 శాతం మధ్య డీలా పడ్డాయి. 

ఆటో  జూమ్
డెరివేటివ్స్‌లో భారత్‌ ఫోర్జ్‌, అశోక్‌ లేలాండ్‌, ఇండిగో, భెల్‌, చోళమండలం, శ్రీరామ్‌ ట్రాన్స్‌, టాటా పవర్‌, పీవీఆర్‌, టాటా కన్జూమర్‌, కంకార్‌ 16-4 శాతం జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు అరబిందో 6 శాతం పతనంకాగా.. ఐబీ హౌసింగ్‌, బంధన్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ ప్రు, పీఎన్‌బీ 2.5-1.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.6-0.8 శాతం స్థాయిలో ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,578 లాభపడగా.. 1155 నష్టాలతో ముగిశాయి.

డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 351 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 940 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1014 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1415 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 303 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 505 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 

మరిన్ని వార్తలు