రికార్డు స్థాయిలో ముగిసిన స్టాక్ మార్కెట్!

11 Oct, 2021 16:06 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు రికార్డు గరిష్ట స్థాయిలో ముగిశాయి. ఉదయం 17,867 పాయింట్లతో ప్రారంభమైన సూచీలు బుల్‌ జోరు కొనసాగుతుండటంతో 18 వేల మార్క్‌ని టచ్‌ చేసింది. ఆటో, బ్యాంక్, మెటల్, పవర్, రియాల్టీ స్టాక్స్ మద్దతుతో సూచీలు రికార్డు గరిష్ట స్థాయిలో ముగిశాయి.  అంతర్జాతీయ సానుకూలతలతో పాటు దేశీయంగా రిలయన్స్‌, టాటా మోటార్స్‌ వంటి దిగ్గజ షేర్లు జీవితకాల గరిష్ఠానికి చేరడం సూచీలు ముందుకు నడిచాయి. చివరకు, సెన్సెక్స్ 76.72 పాయింట్లు (0.13%) పెరిగి 60,135.78 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 50.80 పాయింట్లు (0.28%) పెరిగి 17,946.00 వద్ద ముగిసింది. సుమారు 1814 షేర్లు అడ్వాన్స్ అయితే, 1375 షేర్లు క్షీణించాయి, 141 షేర్లు మారలేదు.

డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ రూ.75.38 వద్ద ఉంది. నిఫ్టీలో టాటా మోటార్స్, కోల్ ఇండియా, మారుతి సుజుకి, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ మరియు పవర్ గ్రిడ్ కార్ప్ షేర్లు భారీగా లాభపడితే.. టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, విప్రో భారీగా నష్ట పోయాయి. ఐటీ రంగాలలో ఇండెక్స్ 3 శాతం పడిపోగా.. ఆటో, బ్యాంక్, మెటల్, పవర్, రియాల్టీ సూచీలు 1-2.5 శాతం పెరిగాయి. (చదవండి: శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఇస్రోతో వన్ వెబ్ కీలక ఒప్పందం)

మరిన్ని వార్తలు