ర్యాలీ బాటలోనే- సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీ

7 Oct, 2020 15:54 IST|Sakshi

304 పాయింట్లు అప్‌ -39,879 వద్ద ముగింపు

76 పాయింట్ల జమతో 11,739 వద్ద నిలిచిన నిఫ్టీ

ఎన్‌ఎస్‌ఈలో ఆటో, ఐటీ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ జోరు

మీడియా, రియల్టీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా వీక్‌

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం డౌన్‌

తొలుత అటూఇటుగా ప్రారంభమైనప్పటికీ వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల దుమ్ము రేపాయి. సెన్సెక్స్‌ 304 పాయింట్లు ఎగసి 39,879 వద్ద నిలవగా.. 76 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 11,739 వద్ద ముగిసింది. ముందురోజు యూఎస్‌ మార్కెట్లు పతనంకావడంతో తొలుత మార్కెట్లు స్వల్ప ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,968- 39,451 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనైంది. నిఫ్టీ సైతం 11,763- 11,629 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.

టైటన్‌ ప్లస్‌లో
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఆటో, ఐటీ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 1.4-0.6 శాతం మధ్య బలపడగా.. మీడియా 2.5 శాతం క్షీణించింది. రియల్టీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా సైతం 2-0.8 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టైటన్‌, బజాజ్‌ ఆటో, హీరో మోటో, మారుతీ, ఆర్‌ఐఎల్‌, ఓఎన్‌జీసీ, శ్రీ సిమెంట్‌, ఐషర్‌, విప్రో, అల్ట్రాటెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, నెస్లే, ఇన్ఫోసిస్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బ్రిటానియా, యాక్సిస్‌, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ 4.5-0.6 శాతం మధ్య ఎగశాయి. అయితే బజాజ్‌ ఫైనాన్స్‌, బీపీసీఎల్‌, హిందాల్కో, టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌, కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, సన్‌ ఫార్మా, గెయిల్‌, బజాజ్‌ ఫిన్‌, అదానీ పోర్ట్స్‌ 4-1 శాతం మధ్య వెనకడగు వేశాయి.

అంబుజా అప్
డెరివేటివ్‌ కౌంటర్లలో అంబుజా సిమెంట్‌, పేజ్‌, బంధన్‌ బ్యాంక్‌, ఏసీసీ, అపోలో హాస్పిటల్స్‌, టాటా పవర్‌, టీవీఎస్‌ మోటార్‌, రామ్‌కో సిమెంట్‌ 4.5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క వేదాంతా 11 శాతం కుప్పకూలింది. ఇతర కౌంటర్లలో జీ, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఎంజీఎల్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, భెల్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, డీఎల్‌ఎఫ్‌, పిరమల్‌, చోళమండలం, సెయిల్‌, ఐడియా 4.6-2.3 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం స్థాయిలో నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1,594 నష్టపోగా.. 1,079 లాభపడ్డాయి. 

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,102 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 935 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 237 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  డీఐఐలు రూ. 472 కోట్ల అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు