మార్కెట్లు భల్లేభల్లే- మీడియా, బ్యాంక్స్‌ ఖుషీ

7 Dec, 2020 15:58 IST|Sakshi

347 పాయిం‍ట్లు అప్‌- 45,427కు చేరిన సెన్సెక్స్‌

97 పాయింట్లు పెరిగి 13,356 వద్ద ముగిసిన నిఫ్టీ

మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ జోరు‌

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్ క్యాప్స్‌ 1-1.3 శాతం ప్లస్‌

ముంబై, సాక్షి: జీడీపీ వృద్ధి అంచనాలు, వ్యాక్సిన్ల అందుబాటుపై ఆశలు దేశీ స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో మరోసారి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 347 పాయింట్లు జంప్‌చేసి 45,427 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 97 పాయింట్లు జమ చేసుకుని 13,356 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో చివర్లో సెన్సెక్స్‌ 45,459 వద్ద, నిఫ్టీ 13,366 వద్ద సరికొత్త గరిష్టాలను తాకాయి! అయితే తొలుత సెన్సెక్స్‌ 45,024 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13,242 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేసుకున్నాయి.

రియల్టీ డౌన్
ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ(0.35 శాతం) మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్‌‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ 2.8-1.6 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌యూఎల్‌, ఎయిర్టెల్‌, ఓఎన్‌జీసీ, ఐటీసీ, కోల్‌ ఇండియా, గెయిల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్‌ రెడ్డీస్ 4.6-2.5 శాతం మధ్య జంప్‌ చేశాయి. అయితే ఎస్‌బీఐ లైఫ్‌, నెస్లే, కొటక్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, బజాజ్ ఫైనాన్స్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌, టైటన్‌ 1.5-0.7 శాతం మధ్య బలహీనపడ్డాయి.

ఫైనాన్స్‌ జోష్‌
డెరివేటివ్స్‌లో శ్రీరామ్‌ ట్రాన్స్‌, కెనరా, గ్లెన్‌మార్క్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఐబీ హౌసింగ్‌, సన్‌ టీవీ, బంధన్‌ బ్యాంక్‌, జీ, టాటా కెమికల్స్‌, లుపిన్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ 6-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఎస్కార్ట్స్‌, డీఎల్‌ఎఫ్‌, చోళమండలం, ఐడియా, వోల్టాస్‌, జూబిలెంట్‌ ఫుడ్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ 2.3-0.7 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌1-1.3 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,038 లాభపడగా.. 934 నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,970 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. రూ. 1,972 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 3,637 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 1,440 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు