మార్కెట్లు ప్లస్‌- ఈ చిన్న షేర్లు యమస్పీడ్‌

16 Sep, 2020 13:26 IST|Sakshi

సెన్సెక్స్‌ 191 పాయింట్లు డౌన్‌- 39,235కు

ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లకు డిమాండ్‌

జాబితాలో ఇండోస్టార్‌ క్యాపిటల్‌, సొమానీ సిరామిక్స్‌, స్కిప్పర్‌

టేక్‌ సొల్యూషన్స్‌, హిమత్‌సింగ్‌కా సీడే,  ఆటోమోటివ్‌ యాక్సిల్స్‌

స్వల్ప ఊగిసలాట మధ్య ప్రారంభమైన ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 191 పాయింట్లు ఎగసి 39,235కు చేరింది. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌, సొమానీ సిరామిక్స్‌, టేక్‌ సొల్యూషన్స్‌, హిమత్‌సింగ్‌కా సీడే, ఆటోమోటివ్‌ యాక్సిల్స్‌, స్కిప్పర్‌ లిమిటెడ్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. 

ఆటోమోటివ్‌ యాక్సిల్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 12.5 శాతం దూసుకెళ్లి రూ. 774 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 794 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో  గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 3,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 9,000 షేర్లు చేతులు మారాయి.

ఇండోస్టార్‌ క్యాపిటల్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం జంప్‌చేసి రూ. 286 వద్ద  ట్రేడవుతోంది. తొలుత రూ. 292 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 9,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 6,000 షేర్లు చేతులు మారాయి.

సొమానీ సిరామిక్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం లాభపడి రూ. 183 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 12,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 55,000 షేర్లు చేతులు మారాయి.

టేక్‌ సొల్యూషన్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 7.5 శాతం ఎగసింది. రూ. 50 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1.83 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2.37 లక్షల షేర్లు చేతులు మారాయి.

హిమత్‌సింగ్‌కా సీడే
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 7 శాతం ర్యాలీ చేసి రూ. 85 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1.44  లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 66,000 షేర్లు మాత్రమే చేతులు మారాయి.

స్కిప్పర్‌ లిమిటెడ్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం జంప్‌చేసి  రూ. 52.35 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 16,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 20,000 షేర్లు చేతులు మారాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా