ట్రిపుల్‌ సెంచరీ- 40,000 దాటిన సెన్సెక్స్‌

3 Nov, 2020 09:47 IST|Sakshi

409 పాయింట్ల హైజంప్‌- 40,166కు

111 పాయింట్లు ఎగసి 11,780కు చేరిన నిఫ్టీ

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే

బ్యాంక్‌ నిఫ్టీ, మెటల్‌, ఫార్మా, ఆటో అప్‌

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.8 శాతం ప్లస్‌

ప్రపంచవ్యాప్తంగా బలపడిన సెంటిమెంటు నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ చేసింది. ఫలితంగా 40,000 పాయింట్ల మైలురాయిని సులభంగా అధిగమించింది. ప్రస్తుతం 409 పాయింట్లు జంప్‌చేసి 40,166 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 111 పాయింట్లు పెరిగి 11,780కు చేరింది. సోమవారం అమెరికా, యూరోపియన్‌ మార్కెట్లు 0.5-2  శాతం మధ్య ఎగశాయి. ప్రస్తుతం ఆసియాలోనూ అన్ని మార్కెట్లూ లాభాలతో కదులుతున్నాయి. చైనాసహా యూరోప్‌, అమెరికాలో పారిశ్రామికోత్పత్తి పుంజుకున్న వార్తలతో సెంటిమెంటుకు బలమొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.

అన్నిరంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌, మెటల్‌,  ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ 2-0.5 శాతం మధ్య వృద్ధి చూపాయి. నిఫ్టీ దిగ్గజాలో ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బీపీసీఎల్‌, ఇండస్‌ఇండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, గెయిల్‌, యాక్సిస్‌, ఎస్‌బీఐ లైఫ్‌ 3.3-1.5 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో కేవలం అదానీ పోర్ట్స్‌, ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌ 1.6-0.5 శాతం మధ్య క్షీణించాయి.

కేడిలా జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో కేడిలా హెల్త్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, బంధన్‌ బ్యాంక్‌, జిందాల్‌ స్టీల్‌, జీ, అశోక్‌ లేలాండ్‌, ఐబీ హౌసింగ్‌ 8-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఐడియా, జూబిలెంట్‌ ఫుడ్స్‌, పీఎన్‌బీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, యూబీఎల్‌, అంబుజా 3-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.8 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1199 లాభపడగా.. 528 నష్టాలతో కదులుతున్నాయి.

మరిన్ని వార్తలు