రెండో రోజూ మార్కెట్లు అప్‌- ఐటీ జూమ్‌

5 Oct, 2020 16:11 IST|Sakshi

277 పాయింట్లు ప్లస్‌- 38,974కు చేరిన సెన్సెక్స్‌

86 పాయింట్లు జమ చేసుకున్న నిఫ్టీ- 11,503 వద్ద ముగింపు

3.5-1.7 శాతం మధ్య లాభపడ్డ ఐటీ, మెటల్‌, ఫార్మా

బీఎస్‌ఈలో స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.4 శాతం అప్‌

గత వారం చివర్లో హైజంప్‌ చేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి దూకుడు చూపాయి. సెన్సెక్స్‌ 277 పాయింట్లు లాభపడి 38,974 వద్ద ముగిసింది. నిఫ్టీ 86 పాయింట్లు పుంజుకుని 11,503 వద్ద నిలిచింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు వెనుదిరిగి చూడలేదు. తొలుత ఒక దశలో సెన్సెక్స్‌ 39,264 వరకూ ఎగసింది. నిఫ్టీ సైతం 11,578 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. 

ప్రయివేట్‌ బ్యాంక్స్‌ ఓకే
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఐటీ 3.6 శాతం జంప్‌చేయగా.. మెటల్‌ 2.6 శాతం, ఫార్మా 1.7 శాతం, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 0.8 శాతం చొప్పున ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో టీసీఎస్‌, విప్రో, టాటా స్టీల్‌, సన్‌ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, దివీస్‌ ల్యాబ్స్‌, ఐవోసీ, ఇండస్‌ఇండ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌సీఎల్‌, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఐసీఐసీఐ 8-1.2 శాతం లాభపడ్డాయి. అయితే బజాజ్‌ ఫిన్‌, శ్రీ సిమెంట్, ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, గెయిల్‌, బజాజ్‌ ఆటో, పవర్‌గ్రిడ్‌, అదానీ పోర్ట్స్‌, గ్రాసిమ్‌, అల్ట్రాటెక్‌, ఐటీసీ 2.8-1 శాతం మధ్య డీలాపడ్డాయి.

ఎఫ్‌అండ్‌వోలో
డెరివేటివ్‌ కౌంటర్లలో అదానీ ఎంటర్‌, కేడిలా హెల్త్‌, మారికో, భారత్‌ ఫోర్జ్‌, జిందాల్‌ స్టీల్‌, అరబిందో, సెయిల్‌, గోద్రెజ్‌ సీపీ, పెట్రోనెట్‌ 6.5-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. పేజ్‌, నౌకరీ, ఎస్కార్ట్స్‌, ఆర్‌ఈసీ, శ్రీ సిమెంట్‌, ఐజీఎల్‌, ఐడియా, ఐబీ హౌసింగ్‌, చోళమండలం 4-2.2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో స్మాల్‌ క్యాప్‌ 0.4 శాతం బలపడింది. ట్రేడైన షేర్లలో 1,491 లాభపడగా.. 1,229 నష్టపోయాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,632 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 259 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 712 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 409 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. 

>
మరిన్ని వార్తలు