రెండో రోజూ దూకుడు- బ్యాంక్స్‌ భలే

24 Aug, 2020 15:58 IST|Sakshi

364 పాయింట్ల హైజంప్‌- 38,799కు సెన్సెక్స్‌

95 పాయింట్లు పెరిగి 11,467 వద్ద నిలిచిన నిఫ్టీ

ప్రయివేట్‌ బ్యాంక్స్‌ దన్ను-ఫార్మా, ఐటీ వెనకడుగు

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల దూకుడు చూపాయి. సెన్సెక్స్‌ 364 పాయింట్లు జంప్‌చేసి 38,799 వద్ద నిలవగా.. 95 పాయింట్లు ఎగసిన నిఫ్టీ 11,467 వద్ద ముగిసింది. వారాంతాన సైతం నష్టాలను పూడ్చుకుంటూ మార్కెట్లు ఇదే స్థాయిలో పుంజుకున్న విషయం విదితమే. శుక్రవారం యూఎస్‌ ఇండెక్సులు సరికొత్త గరిష్టాలకు చేరగా.. ఆసియాలోనూ మార్కెట్లు లాభపడటం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో సెన్సెక్స్‌  ఒక దశలో 38,895కు చేరింది. తద్వారా 39,000 పాయింట్ల మైలురాయికి చేరువైంది. ఇక నిఫ్టీ సైతం 11,497 వద్ద గరిష్టాన్నీ, 11,411 దిగువన కనిష్టాన్నీ తాకింది. 

రియల్టీ డీలా
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 2.5 శాతం జంప్‌చేశాయి. మీడియా 0.7 శాతం లాభపడగా.. రియల్టీ 1 శాతం నష్టపోయింది. ఫార్మా, ఐటీ 0.3 శాతం చొప్పున డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, కొటక్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ, ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫిన్‌, మారుతీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యూపీఎల్‌, ఆర్‌ఐఎల్‌ 4.7-1 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో పవర్‌గ్రిడ్‌, ఎంఅండ్‌ఎం, అదానీ పోర్ట్స్‌, హిందాల్కో, గ్రాసిమ్‌, టెక్‌ మహీంద్రా, సిప్లా, టైటన్‌, నెస్లే, హీరో మోటో, ఐవోసీ, బజాజ్‌ ఆటో, శ్రీ సిమెంట్‌ 2-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.

ఐడియా అప్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐడియా, జూబిలెంట్ ఫుడ్‌, అదానీ ఎంటర్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, జీఎంఆర్‌, టాటా కెమికల్స్‌, పేజ్‌, ముత్తూట్‌, అరబిందో ఫార్మా, బీఈఎల్‌ 8-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు అపోలో టైర్‌, పీఎఫ్‌సీ, డీఎల్‌ఎఫ్‌, వేదాంతా, సెంచురీ టెక్స్‌, ఈక్విటాస్‌, పీఎన్‌బీ, టాటా పవర్‌, ఆర్‌ఈసీ 3-1.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6-1.5 శాతం మధ్య ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,669 లాభపడగా.. 1,192 నష్టపోయాయి.

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 410 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 251 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. అయితే గురువారం ఎఫ్‌పీఐలు రూ. 268 కోట్లు, డీఐఐలు రూ. 672 కోట్లు  చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.  

మరిన్ని వార్తలు