మిడ్‌ క్యాప్స్‌- భలే జోరు

24 Aug, 2020 13:08 IST|Sakshi

సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీ- 38,765కు

లాభాల సెంచరీతో 11,475 వద్దకు నిఫ్టీ

పలు మిడ్‌ క్యాప్స్‌ రయ్‌రయ్‌

జాబితాలో నవ భారత్‌, వినతీ, బీఏఎస్ఎఫ్‌

దీపక్‌ ఫెర్టిలైజర్స్‌, మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్

విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల పరుగందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 330 పాయింట్లు పురోగమించి 38,765కు చేరగా.. నిఫ్టీ 103 పాయింట్లు జంప్‌చేసి 11,475 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా మార్కెట్లను మార్కెట్లను మించి భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో నవ భారత్‌ వెంచర్స్‌, వినతీ ఆర్గానిక్స్‌, బీఏఎస్‌ఎఫ్‌ ఇండియా, దీపక్‌ ఫెర్టిలైజర్స్‌, మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. 

నవ భారత్‌ వెంచర్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 16 శాతం జంప్‌ చేసింది. రూ. 66 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 55,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 2.81 లక్షల షేర్లు చేతులు మారాయి.

వినతీ ఆర్గానిక్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 12 శాతం ర్యాలీ చేసింది. రూ. 1182 వద్ద ట్రేడవుతోంది. ఇది 52 వారాల గరిష్టం కావడం విశేషం! బీఎస్‌ఈలో గత నెల  రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 8,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.1 లక్షల షేర్లు చేతులు మారాయి.

బీఏఎస్‌ఎఫ్‌ ఇండియా
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం ఎగసి రూ. 1,752 వద్ద ట్రేడవుతోంది. తొలుత 16 శాతం దూసుకెళ్లి రూ. 1,875ను తాకింది. ఇది ఏడాది గరిష్టంకావడం విశేషం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 7,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 46,000 షేర్లు చేతులు మారాయి.

దీపక్‌ ఫెర్టిలైజర్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 11 శాతం జంప్‌చేసింది. రూ. 181 వద్ద ట్రేడవుతోంది. ఇది ఏడాది గరిష్టంకావడం విశేషం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 4.5 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 4.73 లక్షల షేర్లు చేతులు మారాయి.

మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 7 శాతం దూసుకెళ్లింది. రూ. 1872 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1918 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 6,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 5,100 షేర్లు చేతులు మారాయి.

మరిన్ని వార్తలు