డబుల్‌ సెంచరీతో షురూ- ఐటీ వెనకడుగు

28 Sep, 2020 09:48 IST|Sakshi

సెన్సెక్స్‌ 360పాయింట్ల హైజంప్‌- 37,749కు

నిఫ్టీ 114 పాయింట్లు జూమ్‌- 11,164 వద్ద ట్రేడింగ్‌

ఎన్‌ఎస్‌ఈలో ఐటీ మినహా అన్ని రంగాలూ లాభాల్లోనే

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.5 శాతం ప్లస్‌

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 360 పాయింట్లు జంప్‌చేసి 37,749ను తాకగా.. నిఫ్టీ 114 పాయింట్లు ఎగసి 11,164 వద్ద ట్రేడవుతోంది. ఆరు రోజుల వరుస నష్టాల నుంచి వారాంతాన దేశీ స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ సాధించిన విషయం తెలిసిందే. ఇన్వెస్టర్లు మరోసారి కొనుగోళ్లకే ఆసక్తి చూపుతుండటంతో సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీతో ప్రారంభమైంది. ఆపై 37,810 వరకూ ఎగసింది. ఈ బాటలో నిఫ్టీ 11,178 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది.

మీడియా, మెటల్ జోరు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 0.6-3 శాతం మధ్య బలపడ్డాయి. ప్రధానంగా మీడియా, మెటల్‌, రియల్టీ, ఆటో, బ్యాంకింగ్‌ 3-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐటీ 0.6 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫైనాన్స్, టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్, ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ, గెయిల్‌, ఇండస్‌ఇండ్‌, యాక్సిస్‌, కోల్‌ ఇండియా, ఐషర్, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌, ఎస్‌బీఐ, ఐటీసీ, మారుతీ 4.5-2 మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో కేవలం ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, సిప్లా అదికూడా 1.2-0.8 శాతం మధ్య డీలాపడ్డాయి. 

పీవీఆర్‌ అప్
డెరివేటివ్‌ కౌంటర్లలో పీవీఆర్‌, భెల్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, బంధన్‌ బ్యాంక్‌, ఐబీ హౌసింగ్‌, ఎస్కార్ట్స్‌, బాష్‌, చోళమండలం, ఐడియా, జిందాల్‌ స్టీల్‌, కెనరా బ్యాంక్‌, అశోక్‌ లేలాండ్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌  7.5-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క గ్లెన్‌మార్క్‌ 1.3 శాతం, టొరంట్‌ ఫార్మా 0.6 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.5 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,453 లాభపడగా.. కేవలం 345 నష్టాలతో కదులుతున్నాయి.

మరిన్ని వార్తలు