మార్కెట్ల దూకుడు- నిఫ్టీ @12,000

21 Oct, 2020 09:41 IST|Sakshi

391 పాయింట్లు అప్‌- 40,935కు సెన్సెక్స్‌ 

106 పాయింట్లు ఎగసి 12,003 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే

బీఎస్‌ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6 శాతం అప్‌

భారీ ప్యాకేజీపై అంచనాలతో మంగళవారం యూఎస్‌ మార్కెట్లు బలపడగా.. వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ సాధించగా.. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 12,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 391 పాయింట్లు జంప్‌చేసి 40,935కు చేరగా.. నిఫ్టీ 106 పాయింట్లు ఎగసి 12,003 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,945 వద్ద, నిఫ్టీ 12,008 పాయింట్ల వద్ద గరిష్టాలకు చేరాయి. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా యూఎస్‌ ప్రభుత్వం మరోసారి భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించనున్న అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. 

బ్యాంక్స్‌ జోరు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 1-0.3 శాతం మధ్య లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌, ఆటో, మీడియా 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్‌, ఇండస్‌ఇండ్‌, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, హిందాల్కో, ఐసీఐసీఐ, కొటక్‌ బ్యాంక్‌, టైటన్‌, ఎల్‌అండ్‌టీ, యూపీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 3.5-1.25 శాతం మధ్య ఎగశాయి. అయితే నెస్లే, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌ మాత్రమే అదికూడా 1-0.2 శాతం మధ్య నీరసించాయి.

బీవోబీ అప్
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో బీవోబీ, జీ, ఎస్కార్ట్స్‌, వేదాంతా, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, బంధన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, బాలకృష్ణ, పీఎన్‌బీ, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ 3.3-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఐడియా, అపోలో హాస్పిటల్స్‌, ఎంజీఎల్‌, అదానీ ఎంటర్‌, డాబర్‌, జూబిలెంట్‌ ఫుడ్‌ 2-0.25 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,211 లాభపడగా.. 422 మాత్రమే నష్టాలతో ట్రేడవుతున్నాయి.

మరిన్ని వార్తలు