స్వల్ప లాభాలతో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

16 Jul, 2021 11:45 IST|Sakshi

ముంబై: దేశీయ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 56 పాయింట్ల లాభంతో 53,215 వద్ద.. నిఫ్టీ 23 పాయింట్లు లాభపడి 15,947 వద్ద కొనసాగుతున్నాయి.ప్రస్తుతం ఐటీసీ,ఏసియన్‌ పెయింట్స్‌, రిలయన్స్‌, సన్‌ ఫార్మా, ఎయిర్‌టెల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో   కొనసాగుతుండగా.. ఐటీ కంపెనీలు క్యూ 1 ఫలితాలను ప్రకటిస్తుండడంతో  టెక్‌ లాభాల బాట పట‍్టాయి. బ్యాంకింగ్‌, ఆటో మొబైల్‌ స్టాక్‌ సైతం లాభాల బాట పట్టాయి.  

మరిన్ని వార్తలు