అమ్మకాల దెబ్బ- మార్కెట్లు వీక్‌ 

9 Sep, 2020 09:34 IST|Sakshi

ప్రారంభంలో 360 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

ప్రస్తుతం 251 పాయింట్లు డౌన్- 38,114కు 

77 పాయింట్ల నష్టంతో 11,240 వద్ద కదులుతున్న నిఫ్టీ

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 1 శాతం స్థాయిలో మైనస్‌

1 శాతం నీరసించిన బీఎస్‌ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌

సరిహద్దు వద్ద చైనాతో వివాదాలు, యూఎస్‌ మార్కెట్ల క్షీణత నేపథంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు పతనంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 360 పాయింట్లు, నిఫ్టీ 110 పాయింట్ల నష్టంతో మొదలయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 251 పాయింట్లు క్షీణించి 38,114కు చేరగా.. నిఫ్టీ 77 పాయింట్లు తక్కువగా 11,240 వద్ద ట్రేడవుతోంది. టెక్‌ దిగ్గజాలలో అమ్మకాలతో వరుసగా మూడో రోజు మంగళవారం యూఎస్‌ మార్కెట్లు 2.2-4.2 శాతం మధ్య పతనంకావడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. 37,982 దిగువన ప్రారంభమైన సెన్సెక్స్‌ వెనువెంటనే 38,136 వరకూ బలపడింది.

బ్లూచిప్స్‌ బోర్లా
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 1 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో కేవలం హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎయిర్‌టెల్, ఏషియన్‌ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా 1.5-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఓఎన్‌జీసీ, యూపీఎల్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, గెయిల్‌, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బీపీసీఎల్‌, బజాజ్‌ ఆటో, ఇన్‌ఫ్రాటెల్‌, ఐటీసీ, జీ 4.4-1.4 శాతం మధ్య బోర్లా పడ్డాయి. 

ఐడియా వీక్‌
డెరివేటివ్స్‌లో ఐడియా 4.5 శాతం పతనంకాగా.. ఎన్‌ఎండీసీ, జిందాల్‌ స్టీల్‌, కంకార్‌, నాల్కో, సెయిల్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, బంధన్‌ బ్యాంక్‌, అశోక్‌ లేలాండ్‌, భెల్‌, టాటా కెమికల్స్‌, భారత్ ఫోర్జ్‌, హావె్స్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌  3.6-2 శాతం మధ్య క్షీణించాయి. కాగా.. ఎస్కార్ట్స్‌, అపోలో టైర్‌, అదానీ ఎంటర్‌, మ్యాక్స్ ఫైనాన్స్‌, టొరంట్‌ ఫార్మా, అమరరాజా, అపోలో హాస్పిటల్స్‌, బీఈఎల్‌, మెక్‌డోవెల్‌, లుపిన్‌, పిడిలైట్‌, బెర్జర్‌ పెయింట్స్‌ 2.2-0.5 శాతం మధ్య బలపడ్డాయి బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1251 నష్టపోగా.. 367 లాభాలతో కదులుతున్నాయి.

మరిన్ని వార్తలు