నష్టాలలో మార్కెట్లు.. బ్యాంక్స్‌ డౌన్‌

13 Nov, 2020 09:41 IST|Sakshi

రెండో రోజూ మార్కెట్ల వెనకడుగు

242 పాయింట్లు డౌన్‌- 43,115కు సెన్సెక్స్‌

72 పాయింట్ల నష్టం- 12,619 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ

బ్యాంకింగ్‌, మీడియా, మెటల్‌ వీక్‌

రియల్టీ, ఫార్మా రంగాలు ప్లస్‌

ముంబై: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 242 పాయింట్లు పతనమై 43,115ను తాకగా.. నిఫ్టీ 72 పాయింట్లు క్షీణించి 12,619 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలోసెన్సెక్స్‌ 43,299 వద్ద గరిష్టాన్ని తాకగా.. 43,071 వద్ద కనిష్టానికి చేరింది. ఇక నిఫ్టీ 12,662- 12,614 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. కోవిడ్‌-19 కేసుల పెరుగుదల, ప్రభుత్వ ప్యాకేజీపై అనిశ్చితి నేపథ్యంలో గురువారం యూఎస్‌ మార్కెట్లు 1 శాతం నష్టపోయాయి. ప్రస్తుతం ఆసియాలోనూ బలహీన ధోరణి కనిపిస్తోంది. కాగా.. వరుసగా 8 రోజులపాటు 10 శాతం జంప్‌చేసిన మార్కెట్లో వరుసగా రెండో రోజు ట్రేడర్లు లాభాల స్వీకరణకే ప్రాధాన్యమిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

బ్యాంక్స్ బోర్లా
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంకింగ్‌, మీడియా, మెటల్‌ 1.7-0.8 శాతం మధ్య నీరసించాయి. ఫార్మా, రియల్టీ 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌, యాక్సిస్, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎప్‌సీ, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ 2.7-1.5 శాతం మధ్య డీలాపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఐషర్‌, టైటన్‌, దివీస్‌, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, గ్రాసిమ్‌, ఆర్‌ఐఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సిప్లా, హీరో మోటో 3-1 శాతం మధ్య ఎగశాయి. 

సన్‌ టీవీ వీక్
డెరివేటివ్ కౌంటర్లలో సన్‌ టీవీ, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, బీవోబీ, బంధన్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ, సెయిల్‌ 3.6-2 శాతం మధ్య క్షీణించాయి. అయితే జూబిలెండ్‌ ఫుడ్‌, అపోలో హాస్పిటల్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, పెట్రోనెట్, ఐబీ హౌసింగ్, ఐజీఎల్‌, బయోకాన్‌, కేడిలా హెల్త్‌ 4-1.2 శాతం మధ్య జంప్‌ చేశాయి. బీఎస్‌ఈలో ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 849 లాభపడగా.. 780 నష్టాలతో కదులుతున్నాయి.

మరిన్ని వార్తలు