రెండో రోజూ మార్కెట్ల ర్యాలీ బాట..

14 Dec, 2020 09:44 IST|Sakshi

207 పాయిం‍ట్లు ప్లస్‌- 46,306కు సెన్సెక్స్‌

60 పాయింట్లు ఎగసి 13,574 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ

ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ మినహా అన్ని రంగాలూ లాభాల్లోనే

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్ క్యాప్స్‌ 0.5-0.7 శాతం అప్‌

ముంబై, సాక్షి: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 207 పాయింట్లు లాభపడి 46,306కు చేరింది. నిఫ్టీ సైతం 60 పాయింట్లు ఎగసి13,552 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన యూఎస్‌ మార్కెట్లు స్వల్ప వెనకడుగు వేసినప్పటికీ దేశీయంగా ఆర్థిక రికవరీ, వ్యాక్సిన్ల అందుబాటుపై ఆశలు సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 46,373 ఎగువన, నిఫ్టీ 13,597 వద్ద గరిష్టాలకు చేరాయి. 

రియల్టీ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ(0.2 శాతం) మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయి. మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ 2-0.8 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో సిప్లా, కోల్‌ ఇండియా, ఓఎన్‌సీసీ, టాటా స్టీల్‌, ఐవోసీ, బ్రిటానియా, గ్రాసిమ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎన్‌టీపీసీ, హిందాల్కో 4.4-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐషర్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, దివీస్‌ మాత్రమే అతికూడా 1-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. 

ఎన్‌ఎండీసీ అప్‌
డెరివేటివ్స్‌లో ఎన్‌ఎండీసీ, ఫెడరల్‌ బ్యాంక్, జిందాల్‌ స్టీల్‌, సెయిల్‌, మదర్‌సన్, బీవోబీ 4.4-2.4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఎస్కార్ట్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, భారత్‌ ఫోర్జ్‌, ఐసీఐసీఐ లంబార్డ్‌, డీఎల్‌ఎఫ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్, టీవీఎస్‌ మోటార్ 1.5-0.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5-1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,650 లాభపడగా..513 నష్టాలతో కదులుతున్నాయి.

ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్‌మెంట్స్
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,195 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,359 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 2,260 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  డీఐఐలు రూ. 2,275 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 

>
మరిన్ని వార్తలు